15*05*
పశుపక్ష్యాదులలో వావి వరుసలుంటాయా ?
...................................
మనుషుల్లో లాగా జంతువులు, పక్షులకు అక్క చెల్లి తల్లి పిన్ని కూతురు కొడుకు అన్న తమ్ముడు నాన్న చిన్నాన్న వంటి రక్త సంబంధాలపై అవగాహన ఉండదు. కాని ప్రకృతి వాటికి తన దగ్గరి బంధువులతో జతకట్టకుండా నివారించే కొన్ని సహజ పద్ధతులను నేర్పింది. దీన్నే శాస్త్రీయంగా ఇన్‌బ్రీడింగ్ అవాయిడెన్స్ అంటారు.
జంతువులకు మనుషుల్లాంటి నైతికత సామాజిక నియమాలు వావివరుసల పట్టింపు ఉండదు. ఒక మగ కుక్కకు అవకాశం వస్తే తన తల్లితో చెల్లితో కూతురితో కూడా జతకట్టగలదు. కోళ్లు పిల్లులు మేకలు సింహాలు వంటి జంతువులలోనూ ఇది కనిపిస్తుంది. వాటికి ఇది నా తల్లిచెల్లి కొడుకు అనే స్పృహ ఉండదు. వాసన హార్మోన్లు బుుతుక్రమం ఆధారంగానే అవి జతను ఎంచుకుంటాయి. కాని ప్రకృతి ఇన్‌బ్రీడింగ్‌ను కొంతగా తగ్గించే విధంగా ఏర్పాటు చేసింది.
చాలా జంతుజాతుల్లో యుక్తవయసు రాగానే ఆడమగ జంతువులు తాము పుట్టిన గుంపు నుంచి దూరంగా వెళ్లిపోతాయి. ఉదాహరణకు సింహాల్లో మగపిల్లలు 2 లేదా 3 ఏళ్లకు గుంపు నుంచి తరిమివేయబడతాయి.ఏనుగుల్లో మగ ఏనుగులు 12 లేదా 15 ఏళ్లకు ఒంటరిగా వెళ్లిపోతాయి.తోడేళ్లు కోతులు జింకల్లోనూ ఇదే విధానం కనిపిస్తుంది. దీనివల్ల ఒకే తల్లి పిల్లలు జతకట్టే అవకాశం తగ్గుతుంది.
చాలా క్షీరదాలు దగ్గరి బంధువుల వాసన పసిగట్టి వాటితో జతకట్టడానికి ఇష్టపడవు. దీన్నే వెస్టర్మార్క్ ఎఫెక్ట్ అంటారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాటి మధ్య లైంగిక ఆకర్షణ తగ్గుతుంది. పక్షుల్లో చాలావాటికి చిన్నప్పుడు ఎదిగిన గూడు దగ్గరి సహచరుల కంటే వలస వచ్చిన కొత్త పక్షులతో జతకట్టే అలవాటు ఉంటుంది.
ఒకే తల్లిదండ్రుల పిల్లలు జతకడితే ఇన్‌బ్రీడింగ్ వల్ల సంతానంలో జన్యులోపాలు బలహీనతలు పెరిగి రోగనిరోధక శక్తి తగ్గి అవయవ లోపాలు వచ్చే ప్రమాదం ఎక్కువ వుంటుంది. అందుకే ప్రకృతి పరిణామ ప్రక్రియలో ఇన్‌బ్రీడింగ్‌ను తగ్గించే జాతులే మనుగడ సాగించాయి. ప్రకృతి ఈ వైవిధ్యాన్నే కోరుకుంటుంది.
అయితే కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. బోనులో పెంచే కుక్కలు పిల్లులు సింహాలు పులులు కోళ్లు వాటికి వేరే స్థలం లేక వేరే జత దొరక్కపోవడం వల్ల అన్నాచెల్లెళ్లు తల్లీకొడుకులు జతకడతాయి. దీన్నే కొందరు కావాలనే ఆయా జాతుల అభివృద్ధి కొరకు లైన్ బ్రీడింగ్ చేయిస్తారు.ఇది ఆ జాతిని క్రమంగా బలహీనపరుస్తుందన్న సంగతి తెలిసిందే. అడవి పందులు కుందేళ్లలో జనసాంద్రత పెరిగి స్థలం లేనప్పుడు కూడా ఇలా ఇన్‌బ్రీడింగ్ జరుగుతుంది.
జంతువులకు మనలాంటి వావివరుసల నైతిక జ్ఞానం లేదు. అవకాశం వస్తే సొంత తల్లితో, చెల్లితోనైనా జతకడతాయి.కానీ ప్రకృతి మాత్రం వాటికి గుంపు వదిలి వెళ్లడం వాసన ద్వారా తమవారిని గుర్తించడం వంటి పద్ధతులు ఇచ్చి ఇన్‌బ్రీడింగ్‌ను తగ్గిస్తోంది.
మనిషి జ్ఞానశీలి అందుకే సంస్కృతి సాంప్రదాయాలు ధర్మాలతో వావివరుసలను ఏర్పరచుకున్నాడు.
అయితే మేనమామ, అక్క, పినతల్లి పిల్లలతో వివాహ బంధాలు కొన్ని సంస్కృతులలో ఇంకా వున్నాయి.తగ్గించాలి.
॥సేకరణ॥
..............జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.
*భైరవవాక - 10*
🔱
రచన: ఇందూ రమణ
కొబ్బరికాయల వ్యాపారి రామయ్యమ్మ వడివడిగా వచ్చి పాత్రోవాళ్ళని తట్టి లేపింది. ఆమె అలా కంగారు పెట్టేసరికి అందరూ ఉలిక్కిపడి లేచారు. సరిగ్గా అదే సమయానికి కచేరి గంటలు ఠంగు ఠంగున వరుసగా మూడు గంటలు మ్రోగాయి. కొండ బస్సు స్టాండ్ లో నిలబడ్డ దేవస్థానం అర్చకులు, ఉద్యోగుల కొరకు ఉద్దేశించిన బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నానంటు హారన్ మోత వినిపించింది.
కొండ బస్సు పెద్దగా హారన్ కొట్టుకుంటూ షెడ్డులో నుండి బయలుదేరి కొండ బస్టాండ్ కొచ్చింది. ఆ హారన్ శబ్దానికి చెల్లాచెదురు గా తలో దిక్కూ పడుకున్న యాత్రీకులంతా ఉలిక్కిపడి గాబరాతో గబగబా లేచి స్టాండ్లోకి దూసుకువస్తున్న బస్సుకి దారి ఇచ్చారు.
విశాలమైన కొండ బస్ స్టాండ్ లో మధ్యలో మహారాజులా ఉన్న 'చిత్రాటోపి' లో దేవస్థానం సిబ్బంది కొండపైకి వెళ్ళే యాత్రీకులకు బస్సు టిక్కెట్లు అమ్ముతు ఉంటారు. ఇంకా సమయం కాకపోవడం తో ఎక్కువమంది సిబ్బంది ఎవరూ రాలేదు. యాత్రీకులు మాత్రం 'చిత్రాటోపి' టిక్కెట్టు బుకింగ్ కౌంటర్ ముందు క్యూలో నిలబడి ఉన్నారు. కొందరు కొబ్బరికాయల దుఖాణం దగ్గర, కొందరు టీ బండ్ల దగ్గర, ఇంకొందరు కోనేరుకు బయలుదేరుతూ, ఇంకొందరు కోనేరులో స్నానం ముగించి మెట్ల మార్గంలో కొండపైకి వెళుతున్నారు.
కొండ పైకి వెళ్ళడానికి బస్సు రావడంతోనే కొందరు యాత్రీకులు బస్సు దగ్గరకి పరుగు లెట్టారు. అయితే, డ్రైవర్ వారినందర్నీ వారించి వెనక్కి పంపేసాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న అర్చకులు, ఉద్యోగులు ఆ బస్సులోకి ఎక్కి కూర్చున్నారు. ముందు అర్చకులను కొండపైకి తీసుకువెళ్ళే బస్సని డ్రైవర్ నచ్చజెప్పేసరికి యాత్రీకులు ఉస్సూరంటూ ఎవరిదారిన వారు మళ్ళా క్యూలో నిలబడ్డారు.
కొండ బస్సు అరక్షణంలో పూజారులతోను, దేవాలయ సాధారణ సిబ్బంది తోను నిండుకుంది.
ముందుగా అర్చకులు ఆలయానికి చేరుకొని సంప్రోక్షణ చేసి స్వామికి మేలుకొలుపు సుప్రభాత సేవలు చేసి బాలభోగం తదితర సేవలు ఆచరించి ఆ తర్వాత భక్తులకు దైవ దర్శనాన్ని కలిగిస్తారు. ఇది రోజూ జరిగే సాధారణ సాంప్రదాయం.
ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకూ సాగే ప్రత్యేక దర్శనాలు తర్వాత ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పది గంటలవరకూ దైవదర్శనం కొనసాగుతూనే ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఓ అర్ధగంట దర్శనాలు నిలుపుదల చేసి చందన స్వామికి రాజభోగం నిర్వహించి అర్చకుల 'ఆరగింపులు' (భోజనాలు) అయ్యాక తిరిగి దర్శనాలు కొనసాగిస్తారు. ఇది నిత్యం జరిగే నిత్య కృత్యం.
📖
అర్చకులను మోసుకుంటూ కొండబస్సు బయలుదేరింది. కొండచిలువ లా భారంగా కదులుతూ ఘాట్ రోడ్డులో వెళుతోంది బస్సు. యాత్రీకుల్లో కూడా హడావిడి అధికమైంది.
అప్పటికే పాత్రో కుటుంబ సభ్యులందరూ లేచి పక్కబట్టలు సర్దుకుంటున్నారు. ఆడాళ్ళు మొహాలు కడుక్కుంటున్నారు. పాత్రో తండ్రి, పాత్రో, గైడ్ పాండే ముగ్గురూ సులబ్ కాంప్లెక్స్ వద్దకు వెళ్ళారు. అందరూ కాలకృత్యాలు తీర్చుకుని ఒక దగ్గర చేరారు.
రాత్రి ప్రయాణ బడలికతో వాళ్ళకి ఆ పరిసరాలు చూసినప్పుడు ఎలాంటి స్పందనా కలగలేదు.
ఇప్పుడు-
ఈ యాత్రీకుల సందోహం- ఈ హడావుడి... గందరగోళం- అంతా చూస్తుంటే పాత్రో కుటుంబసభ్యులకే కాదు ఆరు నెలలుగా ఇక్కడ ఉంటూ ఎంతోమంది యాత్రీకులకు గైడ్ గా వ్యవహరించి క్షేత్రమహాత్య్మం తెలియజేసిన గైడ్ పాండేకి కూడా అంతా కొత్తగాను ... వింతగాను అన్పిస్తోంది.
'చందనగిరి' శిఖరం అదే!" ఎత్తుగా అంబారి ఏనుగులా ఉన్న కొండను చూపిస్తూ చెప్పాడు పాండే. పాత్రోతో పాటు మిగతా అందరి దృష్టి కొండపైకి మళ్ళింది.
చుట్టూరా ఎత్తైన కొండ విచ్చీ విచ్చని చీకటిపొరతో లేలేత వెన్నెల వెలుగులో జలతారులా పరుచుకున్న మంచుతెరల మాటున అస్పష్టంగా ఆకుపచ్చ రంగులో కన్పిస్తున్న సుందరమైన చందనగిరి శిఖరం చూస్తుంటే ఎంతో ఆనందం కలిగింది పాత్రోకి.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
అప్పుడే ఏదో వెలుతురు రవ్వ కొండమీద ప్రాకుతూ కన్పించింది. చీకటితో నిండిన కొండ బోర్లించిన పెద్ద కుండలా ఉంది. నల్లటి తారుగడ్డ మీద మిణుగురు పురుగులా ప్రాకుతూ వెళ్తున్న వెలుగు.
"ఆ వెలుగు... ఇప్పుడు కొండపైకి వెళ్ళిందే బస్సు. దాని హెడ్ లైట్ల కాంతి ఆది. దేవాలయ సిబ్బందిని, అర్చకుల్ని తీసుకు వెళుతోంది” చెప్పాడు గైడ్ పాండే.
అందరికీ ఆ దృశ్యం నయనానందకరంగా ఉంది.
పాత్రోతో పాటు అందరూ 'టీ' త్రాగుదామని పక్కనే తోపుడు బండి దగ్గరకు వెళ్ళారు.
📖
రాత్రంతా మేల్కొని ఉన్న టీ దుఖాణం యజమాని నిద్రకి తాళలేకపోతున్నాడు. పక్కనే ప్లాస్క్ లో ఉన్న టీ గ్లాసుల్లో పోసి అందరికీ ఇచ్చాడు. పాత్రో పిల్లలిద్దరూ తమకీ 'టీ' కావాలని తండ్రిని మారాం చేసేసరికి ఇద్దరికీ ఒక 'టీ' తీసుకొని చెరో గ్లాసులో పోసిచ్చాడు. అసలు 'టీ' ఎవరికీ కిక్కివ్వలేదు. సరికదా, వేడిగా కూడా లేదు.
ఉదయాన్నే వేడి వేడి 'టీ' లేచీ లేవగానే గొంతులో పడకపోతే ఏ పనీ చెయ్యబుద్ది కాదు. ఎవరీకీ ఆ 'టీ' రుచించలేదు.
"ఎంత?" పాత్రో అడిగాడు.
ఆ సమయంలో టీ దుఖాణంకి కొంచెం దూరంలో గైడ్ పాండే పనిపిల్ల అరుంధతి తో మాట్లాడుతూ 'టీ' సిప్ చేస్తున్నాడు.
"ఏక్ ఛాయ్ తీన్ రుపీ" టకీమనీ చెప్పాడు 'టీ' కొట్టు యజమాని వచ్చిరాని ఒరియా ముక్కలు ఒత్తి పలుకుతూ.
రుచీ... శుచీ లేని ఈ టీ ... అర్థ గ్లాసుడు కూడా లేదు. మూడు రూపాయలా?! పాత్రో మనసుకి బాధ కలిగింది. అనవసరంగా వచ్చి త్రాగామనుకున్నాడు.
ఇంతలో స్థానికుడైన కొబ్బరి కాయల కుర్రాడొకడు వచ్చి 'టీ' త్రాగి రెండు
రూపాయిల కాసు 'టీ' కొట్టు యజమాని మీదకు విసిరి అంతే విసురుగా తిరిగి
వెళ్ళిపోయాడు.
"అదేంటి? అతని దగ్గర రెండురూపాయలే పుచ్చుకున్నావ్! మమ్మల్ని మాత్రం మూడు రూపాయలు అడుగుతున్నావ్" ఒరియా లోనే గద్దించాడు పాత్రో.
"అతను ఇక్కడివాడు. మావాడు చిల్లర అంతే ఉందని విసిరి వెళ్లిపోయాడు.” అని పాత్రోతో ఒరియాలో చెప్పి "వెధవ! ఒడ్డి నా కొడుకు ఈడికి రేటు కావాలట రేటు. ఈళ్ళ వెధవ ముఖాలికి రెండు రూపాయలకి 'టీ' కావల్సి వచ్చింది." బైటికి అందరికీ వినపడేలా గొణుక్కుంటూ వేరేవాళ్ళకి 'టీ' చేస్తున్నాడు అతను.
పాత్రోకి ఆ మాటలు అర్ధం కావటంతో ఒళ్లు జలదరించింది. 'తనకి తెలుగు అర్ధం కాదని ఎలా వాగుతున్నాడు?! రోగ్! వాడి తెగులు వాడ్నే తింటుంది. ఏం చేస్తాం. కోరి గొడవ తెచ్చుకుంటామా?!' మనసులోనే తనని తాను సమర్ధించుకున్నాడు పాత్రో.
జేబులో ఏభై రూపాయల నోటు తీసి ఇచ్చాడు. అతను ఇచ్చిన చిల్లర లెక్క చూసుకొని జేబులో వేసుకున్నాడు పాత్రో.
“ఓరేయ్! నిత్యానంద మహాపాత్రో! ఏరా ఇలా వచ్చారు? ఎప్పుడు వచ్చారు?" ఎవరో ఏభైఏళ్ళ పై బడ్డ వ్యక్తి పాత్రోని వెనుక మాటున కౌగిలించుకొని పట్టి కుదిపేసరికి వెనక్కి తిరిగాడు పాత్రో.
గైడ్ పాండే మాత్రం ఇదేం పట్టించుకోవడం లేదు. అతను పనిపిల్ల ధ్యాసలో ఉన్నాడు. అరుంధతి కూడా ముసిముసిగా నవ్వుతూ గైడ్ పాండేని రెప్పవేయకుండా చూస్తూ అతని మాటలు వింటోంది. పాత్రో భార్య శశికళ పిల్లలిద్దరికి 'టీ' త్రాగిస్తోంది. పాత్రో తల్లి గుడి దగ్గరకు అవసరమయ్యే సామాన్లు బ్యాగ్ లో సర్దుతోంది.
"నువ్వా దాసు! ఎప్పుడొచ్చావు!? ఎవరెవరు వచ్చారు? మిగతా వాళ్ళేరి" దేశం కాని దేశంలో తమ భాష కాని, రాని ప్రదేశంలో తమ వూరివాడు ఎదురయ్యే సరికి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు పాత్రో.
తమ వూరి వ్యక్తిని చూసేసరికి పాత్రో తల్లి దండ్రులకి కూడా సంతోషం కలిగింది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
"మా అబ్బాయి నేనూ వచ్చాం". అన్నాడే గాని అతని ముఖంలో ఏకోశానా సంతోషం లేదు. దిగాలుగా గొంతులో తడారిపోయి నట్టూ అన్నాడతను.
"ఏడీ ... వాడేడి!" చుట్టూ పరికిస్తూ అన్నాడు పాత్రో.
"వస్తాడు... వస్తాడు. " నసుగుతూ అన్నాడతను.
"ఏమైంది... అలా ఉన్నావేం!" అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకుంటూ అన్నాడు పాత్రో తండ్రి.
అతను భోరున ఏడుస్తూ కూర్చుండి పోయాడు.
ఇంతలో పోలీసు వ్యాన్ వచ్చి ఆగింది అక్కడ.
అందులో నుండి ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళు దిగారు. అందులో ఒక కుర్రాడు పాత్రోవాళ్ళ దగ్గర ఉన్నతన్ని చూస్తూనే పరుగు పరుగున వచ్చి చేరుకున్నాడు.
"బప్పా” ... అంటూ అతన్ని పట్టుకొని ఏడ్చేసాడు. ఆ కుర్రాడి కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి. తల చిందర వందరగా ఉంది. బట్టలు నలిగి ఉన్నాయి.
అప్పటికే పోలీసు వ్యాన్ తిరిగి వెళ్ళిపోయింది.
ఆ కుర్రాడు దుఃఖం ఆపుకోలేకపోతున్నాడు.
📖
“ఏఁవైంది" ఒరియాలో నాలుగు మూలల నుంచి పాత్రో, పాత్రో కుటుంబసభ్యులు అడిగేసరికి ఆ కుర్రాడికి కొంచెం ధైర్యం కలిగినట్టుంది. తల పైకి ఎత్తి వారి కళ్ళలోకి దీనంగా చూసాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
పనిపిల్ల అరుంధతి, గైడ్ పాండే కూడా అక్కడకు చేరుకున్నారు.
"రాత్రి....!" అని క్షణం ఆగి కళ్ళు తుడుచుకున్నాడు ఆ కుర్రాడు.
"రాత్రి.... నేను నాన్నగారు కలిసి ఈ వూరు యాత్రకి వచ్చాం. భువనేశ్వర్ లో ఉన్న చందనస్వామి భక్తుడు 'గురువు' పండా గారితో మన వాళ్ళందరూ బయలుదేరితే వారితో మేము బయలుదేరాము. అయితే, అప్పటికే ఆయన అందర్నీ తీసుకొని ముందు ట్రైన్ లో ఇక్కడికి వచ్చేసారు. తర్వాత ట్రైన్ లో మేము వచ్చాము. రాత్రి పూట గురువుగారు ఎక్కడున్నారో తెలుసు కోవడం కష్టమని ఉదయాన్నే కలవచ్చని వచ్చీరాగానే ఇక్కడ లాడ్జీలో దిగాం, హోటల్లో భోజనం చేసి రూమ్ కొచ్చి పడుకున్నాం. నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. హోటల్ భోజనం బాగాలేదు. సరిగ్గా తినలేకపోయాను. ఆకలికి తట్టుకోలేక రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో రోడ్డు మీదకొచ్చి అరటిపళ్లు కొనుక్కొని తిరిగి లాడ్జికి చేరుకున్నాను. లాడ్డీ వరండాలో బైట పిట్టగోడమీద కూర్చున్నాను.
ఇంతలో పోలీస్ వ్యాన్ వచ్చింది. అందులో నుండి పోలీసులు బూట్లు టక టక లాడించుకుంటూ పరుగు పరుగున వచ్చారు. లాడ్జీలో ఉన్న గదులన్నీ తనిఖీ చేసారు.
మా ప్రక్క గదిలో-! చాలామంది ఉన్నారు. పోలీసులు వచ్చి గది తలుపులు తట్టారు. ఎవరో అనుకొని లోపలి వాళ్ళు తలుపులు తీసారు.
అంతే-
పోలీసుల్ని చూడటంతోనే లోపల ఉన్నవాళ్ళు బైటకొచ్చి చెల్లాచెదురుగా పరుగులు తీసారు. పారిపోయిన వాళ్ళందర్ని తరిమి తరిమి పట్టుకున్నారు. అందర్ని వ్యాన్ ఎక్కించారు. అందులో ఇద్దరమ్మాయిలు కూడా ఉన్నారు.
అప్పుడు-
పిట్టగోడ మీద కూర్చున్న నన్ను ఓ పోలీసు చూసి పరుగున వచ్చాడు. నా చెయ్యి పట్టుకొని బరబరా లాక్కుపోయాడు. నాకేం తేలీదని నేను ఎంత మొత్తుకున్నా నా మొరవినలేదు. నా అరుపులకి నాన్న గారు గది బైటకొచ్చారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
నాన్నగారు కూడా వాళ్ళ కాళ్ళ వ్రేళ్ళ పడ్డారు. కాని, వాళ్ళు ససేమిరా కాదని నన్నూ మిగతా వాళ్ళతో పాటే పోలీస్ స్టేషన్ కి లాక్కుపోయారు. ఆ గదిలో ఉన్న ఇద్దరమ్మాయిల్ని కూడా మాతో పాటే వ్యాన్ ఎక్కించారు. ఆ అమ్మాయిల్ని వేరే గదిలో ఉంచి... మమ్మల్నందర్నీ ఒక గదిలో పడేసారు. ఆ తరువాత కొద్దిసేపటికి ఆ అమ్మాయిల్ని వదిలేసారు. మమ్మల్ని మాత్రం రాత్రంతా గదిలో ఉంచి చిత్రహింసలు పెట్టారు.
నేను ఒరియాలో మాట్లాడుతుంటే ... నేను తెలుగు వచ్చి కూడా మాట్లాడటం లేదని నేను నాటకం ఆడుతున్నానని మరింత చితకబాదారు. నాతో పాటు గదిలో ఉన్న కుర్రాళ్లు నా బాధ చూడ్లేక నాకూ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని కాగితం వ్రాసి ఇచ్చారు. నాలా ఏ సంబంధం లేని వాళ్ళని యాత్ర కొచ్చిన వాళ్ళని ఇదిగో ఇలా ఇప్పుడు వాళ్ళే తీసుకువచ్చి ఇక్కడ వదిలిపెట్టారు.” దాదాపు ఏడూస్తూనే చెప్పాడు కుర్రాడు.
పాత్రోకి కళ్ళు చెమ్మగిల్లాయి. పాత్రోయేకాక ఆ కుర్రాడి కధ విన్న పాత్రో కుటుంబ సభ్యులందరూ కంటతడి పెట్టుకున్నారు.
"ఇక మీరు ఎక్కడకీ వెళ్లకండి. మాతో కలసి ఉండండి. అందరం కలిసి దర్శనానికి వెళ్దాం." అన్నాడు పాత్రో.
పాత్రో మాటకు వాళ్ళు సరేనన్నారు.
అంతలో రామయమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చింది.
"కొనేరుకు వెళ్ళరా?!" వాళ్ళ దగ్గరకు వస్తూనే అంది ఆమె.
"ఎందుకు వెళ్ళం? వెళ్తాం.... పదండిరా! వేగంగా తెమలండి" పాత్రో తండ్రి అన్నాడు.
"వేగంగా వెళ్ళిరండి, కోనేరు దగ్గర చాలా దొమ్మీగా ఉంటుంది. స్నానాలు కానిచ్చేసిన తర్వాత భైరవవాక మొక్కు ఉంటే అక్కడికి వెళ్ళాలి కదా.! ఈలోగా మీ కోసం జట్కా మాట్లాడి ఉంచుతాను. సరేనా?!" ఎంత గాబరాగా వచ్చిందో అంతే గాబరాగా తాను చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయింది రామయ్యమ్మ.
గుడి కోసం సర్దిన బ్యాగు ప్రక్కనపెట్టి కోనేరులో స్నానం చేసి బట్టలు మార్చుకో వడానికి కావలసిన కొత్తబట్టలు బ్యాగ్ లో వేసుకొని మిగతావి అక్కడ ఉంచి బయలు దేరారు పాత్రో కుటుంబసభ్యులు. వారితో తండ్రీ కొడుకులిద్దరూ బయల్దేరారు.
పుష్కరిణి అతిధి గృహం... పదహారు గదులు... టి.టి.డి. చౌల్ట్రీ, వాటికెదురుగా ఉన్న అడివివరం సొసైటిని దాటి... రాజవీధి మీదుగా చెరువుకు చేరుకున్నారు అందరూ.
🔱
*సశేషం*
꧁

Comments
Post a Comment