10-05-2026
అమ్మా… అమ్మా…
అమ్మా… అమ్మా…
వందనమమ్మ వందనము
వందనమమ్మ వందనము ॥
గర్భగుడిలో దాచినావు
గడిచిన నవమాసములన్
ప్రాణమునకు రూపమిచ్చి
భువికి నన్ను చేర్చినావ్ ॥
కన్నతల్లివై చూసినావ్
కన్నీరు సైతం దాచినావ్
నవ్వు ముఖమున నింపినావ్
నాకై బాధ మర్చినావ్ ॥
ఆలన పాలన నీవేనన్
అక్షర దీపము నీవేనన్
గోరుముద్దల ప్రేమతోనే
గుండె నిండగ పెంచినావ్ ॥
చేతి పట్టి నడిపినావ్
చదువు బాట చూపినావ్
మనిషినై నిలువ నేర్పి
మంచి మార్గము చెప్పినావ్ ॥
ఎన్నో ఆశల నాపైనుంచి
ఎదురు చూపులు కాచినావ్
విదేశాల దారిలోన
విరహ వేదన మోసినావ్ ॥
కనులు కాయలు కాసినావ్
కరిగె హృదయమున్ లోన
“కొడుకు వస్తాడా?” యని
కొనసాగె నీ నిరీక్షణ ॥
చివరి శ్వాస దరిచేరగ
చూడ నేనె రాలేనమ్మ
చివరి చూపు కోరికతో
చిరునవ్వుతో వెళ్లినావ్ ॥
అమ్మా అని అరచినపుడే
ఆలకించె దైవమువే
అంతరాత్మను కలచివేసె
అభాగ్యుని నే నమ్మా ॥
తెలిసి తెలియక చేసినట్టి
తప్పులన్ని క్షమించమ్మా
తల్లిదండ్రుల రూపములో
తారకమై దీవించమ్మా ॥
అమ్మ లేని లోకమంతా
ఆత్మలేని దేహమమ్మ
అమ్మ ప్రేమే జగతిలోన
అమృతధార సత్యమమ్మ ॥
🙏🌹అమ్మకు వందనం… మాతృప్రేమకు శతకోటి నమనాలు…🌹🙏
[10/05, 05:50] Mallapragada Ramakrishna: ప్రతిరోజు
మాతృభాష, మాతృభూమి, మాతృశ్రీ మరువద్దు
🌹🌹🌹🌹🌹🌹తెలుగుపై ఆసక్తి యున్న ప్రతి ఒక్కరూ వ్రాయగలరని కోరు చున్నాను.
*మాతృశ్రీ *..ఇచ్ఛా.. చందస్సు, లో పద్యం,
10/05
*అమ్మ ,అమ్మ , అమ్మ, అమ్మ* *
🙏🙏🙏🙏🙏🙏🙏
పితృధర్మో యది దుష్టః పుత్రనాశనకారణమ్ ।
మాతృధర్మః సుస్పష్టః కామ్యపూజ్యప్రదాయకః ॥
గురుర్విద్యాప్రఖ్యాతః సర్వసిద్ధిప్రదాయకః ।
గృహిణీ పరువప్రతిష్ఠా గృహశోభా శ్రియంకరీ ॥
భావం...తండ్రి ధర్మం చెడితే సంతానానికి నాశనకారణ మవుతుంది.తల్లి ధర్మం స్పష్టమైనది, పూజనీయ మైనది.గురువు విద్యతో ఖ్యాతి, సిద్ధి ప్రసాదిస్తాడు. గృహిణి ఇంటి పరువు, ప్రతిష్ఠ, శోభకు కారణమవుతుంది.
****
అమ్మ…అమ్మ…అమ్మ…అమ్మ…
మ.కో.
అమ్మయేనిజ దైవసంపద ఆత్మమూలముకాంతిగన్
అమ్మభాషయె సర్వకామ్యము అక్షరంబగు సత్యమున్
అమ్మయే భువి జీవమార్గము ఆదరoబగు దీపమున్
అమ్మ మానవ జన్మసార్థక మంగళంబగు జీవితమ్
భావం :
అమ్మయే నిజమైన దైవసంపద. ఆత్మకు మూలమైన కాంతి అమ్మ. అమ్మభాషయే మనిషి కోరే సర్వసంపదలకు ఆధారం; అక్షరసత్యానికి ఆది. అమ్మయే భూమిపై జీవన మార్గాన్ని చూపించే ఆదరదీపం. అమ్మ వల్లనే మానవ జన్మ సార్థకమై మంగళమయమైన జీవితంగా మారుతుంది.🙏🌹మాతృభాష – మాతృభూమి – మాతృశ్రీ స్మరణే సంస్కృతి మూలము.🌹🙏
******
: గీ. మానవతకు మూలము (అమ్మ) మానసంబు
జ్ఞాన ప్రణవ నాదము (అమ్మ) జ్ఞప్తి తెచ్చు
మౌన దీక్ష దక్షత (అమ్మ) మోక్షశీలి
ధ్యాన తత్పరి గాను (అమ్మ )ధరణి యందు
భావం :మానవత్వానికి మూలం అమ్మ. ఆమె మనసుకు మమతను, కరుణను నేర్పుతుంది. జ్ఞానప్రణవ నాదంలా అమ్మ జ్ఞాపకాన్ని మేల్కొలిపి సత్యబోధను అందిస్తుంది.మౌనదీక్షలో దక్షురాలైన అమ్మ, సహనమనే మహాగుణాన్ని జీవితం ద్వారా బోధిస్తుంది. ధ్యాన తత్పరురాలిగా, మోక్షమార్గాన్ని సూచించే పవిత్ర స్వరూపంగా అమ్మ ఈ ధరణిపై వెలుగుతుంది.
****
[ మాతా సర్వం సర్వాంతర్యామిణీ ।
సంశయ నివృత్తికారిణీ బ్రహ్మిణీ ।
నిర్మలత్వ నిత్య నిర్వాణదాయినీ ।
కర్మకార్య సిద్ధిదాయినీ మాతా ॥
భావం :
అమ్మయే సమస్త జగత్తుకు మూలస్వరూపిణి; ప్రతి హృదయంలో అంతర్యామిగా నిలుస్తుంది.మనసులోని సందేహాలను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే బ్రహ్మస్వరూపిణి అమ్మ.నిర్మలత్వం, నిత్యశాంతి, మోక్షస్వరూపమైన నిర్వాణానుభూతిని అందించేది ఆమె.జీవితంలోని కర్మలు, కార్యాలు సఫలమగుటకు శక్తిని, సిద్ధిని ప్రసాదించే జననీ అమ్మ. 🌹
****
గీ.చిలిపి తనముగా సలిపిన చిత్త చేష్ట
పలికి పలకలేదని చిత్ర పాశమైన
కెలికి పాడుచేసిన తప్పుయెoచ కున్న
కలిని తరిమి తరిమి చూపు గాంచు నమ్మ
భావం :చిన్న చిన్న చిలిపితనాలతో మనసు ఎన్నో చేష్టలు చేసినా,ఎవరైనా పలికినా “పలకలేదు” అని అనుమానాలు, అపార్థాలతో విచిత్రమైన బంధాలను సృష్టిoచినా,ఇలా ఒకరినొకరు కెలికి, బాధపెట్టి చేసిన తప్పులను గుర్తించకుండా జీవించినా కాని అమ్మ మాత్రం కలియుగ స్వభావమైన కలుషిత భావాలను తరిమి తరిమి, నిజమైన మార్గాన్ని చూపిస్తూ మనలను నమ్మకంతో నడిపిస్తుంది.
****
10 ఉపనిషత్తులు..... వాటి సారాంశం..... క్లుప్తంగా
1) ఈశావాస్యోపనిషత్:--
సర్వం ఆత్మగా దర్శించినప్పుడు, సర్వాన్ని ఏకత్వ భావనతో చూసినప్పుడు, శోకం మటుమాయమవుతుందని ఈ ఉపనిషత్ చెప్తుంది.
------------------------------
2) కేనోపనిషత్:--
ప్రతి కదలిక చైతన్యం నుండే ఉద్భవిస్తుంది, చైతన్యం వ్యక్తం కాదు, అవ్యక్తం కాదు, రెండింటికి భిన్నమైనది. ప్రతి ఆలోచన ఈ చైతన్యం నుండే ఉద్భవిస్తుందని ఈ ఉపనిషత్ చెప్తుంది.
-----------------------
3) కఠోపనిషత్:--
ఆత్మ తత్వాన్ని దర్శించినవారే నీకు అనుభవాన్ని ప్రసాదించగలరు.
-----------------------
4) ప్రశ్న ఉపనిషత్:--
నామ, రూప, క్రియలతో నిండిన ఈ సృష్టి స్వచ్ఛమైన పురుషతత్వం నుండి వచ్చింది. గంగ, యమున నదులన్నీ నామరూపాలతో ఉంటాయి. సముద్రంలో కలిసాక నామరూపాలను వదిలేస్తాయి. అలాగే పురుష చైతన్యంతో లీనమయ్యాక ఆ కలయిక ఆత్మగానే, మనకు ఏకంగా సాక్షాత్కరిస్తుంది.
---------------------------
5) ముండకోపనిషత్:--
నీవు చూసే ఈ ప్రపంచం అంతా బ్రహ్మస్వరూపమే, అది పరిపూర్ణంగా నీ చైతన్యమే. ఎక్కడ చూచినా, ఏమి చూచినా, నీకు నువ్వే దర్శనమిస్తుంటావని చెప్తుంది.
-------------------------------
6) మాండూక్య ఉపనిషత్:--
జాగృత్, స్వప్న, సుషుప్తావస్థ అనే 3 అవస్థలు మానవునికి ఉంటాయి., 3 అవస్థలు లేవు. అంతా కలిసి తురియావస్థలోనే ఉందని తెలుస్తుంది.
చూసేవాడు, చూడబడేది, ఇలా రెండు లేవు, రెండూ ఒక్కటే అని చెప్తుంది.
---------------------------
7) తైత్తరేయ ఉపనిషత్:--
మనలో ఉన్న పంచకోశాలు, ఒక్కొక్క పొరలాగా, విప్పుకుంటూ పోయి ఆనందమయ కోశం కూడా దాటి చివరికి కోశాలన్నీ నాకు వేరుగా లేవు, అవన్నీ నా స్వరూపాలే అని చెప్తుంది.
-------------------------------
8) ఐతరేయ ఉపనిషత్:--
ఆత్మను అనేకత్వంగా కాక, ఏకత్వంగా చూడటం నేర్చుకోవాలి., దృష్టి ని ఏకత్వం వైపు మళ్లించాలి.
జీవ జగత్ రూపమైన సృష్టి అంతా ఒక సంకేతం అని శాస్త్రం వర్ణిస్తుంది, ఇదే శాస్త్ర రహస్యం అంటుంది ఐతరేయం.
----–---------------------
9) చాంధోగ్య ఉపనిషత్:--
అంతా ఏకత్వమే అని గ్రహించాక, నేను అనగా శరీర ఇంద్రియాలకు అతీతంగా ఉన్న చైతన్యం అని, ఏకాత్మ రూపమైన ఆ పరమాత్మే నువ్వేనని చెప్తుంది., తత్వమసి అని చెప్తుంది చాందోగ్యం.
------------------------
10) బృహదారణ్యక ఉపనిషత్:--
మనం చేయవలసిన సాధన బాహ్యంగా కాదు, సాధన అంతరంలో చేయాలని 'అహం బ్రహ్మాస్మి' అనే సిద్ధాంతం ఈ ఉపనిషత్ చెప్తుంది.
*****
గద్ద నుండి నేర్చుకోవాల్సిన 5 బిజినెస్ సూత్రాలు...
వ్యాపారంలో విజయం సాధించడమంటే అంత సులువు కాదు. అది ఒక ఛాలెంజ్. ఒక కొత్తగా ప్రారంభించిన వ్యాపారమైనా లేదా ఆల్రెడీ నడుస్తున్న వ్యాపారమైనా చిన్నదైనా పెద్దదైనా అనేక సవాళ్లు, ఒడిదుడుకులు ఎదుర్కుంటూ లాభాలు సాధించాల్సి ఉంటుంది.
ఒక చిన్న వ్యాపారం నుండి ఒక పెద్ద బిజినెస్ మాన్ గా ఎదగాలంటే ఎంతో కఠినమైన దీక్ష, శ్రమ అవసరం. మీకు తెలుసా ఒక గొప్ప వ్యాపారవేత్తగా నిలబడాలనుకునే వాళ్ళు గద్ద (Eagle ) నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అని. ఏంటి గద్ద నుండి వ్యాపారం నేర్చుకోవాలా..? అంటే ఇప్పుడు మేము పక్షి శాస్త్రం నేర్చుకోవాలా అని అడగొద్దు...గద్ద నుండి మనం ఏమి నేర్చుకుంటే విజయం సాదిస్తామో మీకోసం...
జంతువుల్లో రాజు సింహం..మరి పక్షుల్లో గద్ద అని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి జీవితం లో లేదా వ్యాపారంలో విజయం సాధించడానికి ప్రకృతి ని గమనిస్తే చాలు ఏ బిజినెస్ స్కూల్ చెప్పలేని విషయాలు మనకు నేర్పిస్తుంది. గద్ద నుండి ఏమి నేర్చుకుంటే బిజినెస్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారో అనే రహస్యాలు తెలుసుకోండి
దూరదృష్టి:
ఎక్కడో ఆకాశం లో ఎత్తులో తిరిగే గద్దకు దూరదృష్టి చాలా ఎక్కువ. దాదాపు 5 కిలోమీటర్ల దూరం చూడగలదు. తన ఆహారం కోసం విహంగ వీక్షణం చేస్తుంది. బిజినెస్ లో కూడా ఇది వర్తిస్తుంది. అవకాశం కోసం వేచి చూడాలి. తక్షణ ప్రయోజనాలు కాకుండా దూర లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి.
ఒంటరితనం:
గద్ద ఎప్పుడు ఎత్తులో ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది. గుంపులుగా గద్దలు తిరగవు. ఒంటరిగా తిరుగుతూ అలెర్ట్ గా ఉండి తన ఆహరం ఎప్పుడు దొరుకుతుందా అని వేచి చూస్తూ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఒక్కసారి వేగంగా దూకి వేటను చిక్కించుకుంటుంది. నాయకత్వలక్షణాలు ఉన్నవారు జనంతో ఉన్నా కూడా ఒంటరిగా ఉండటం తన అవకాశం కోసం చూడటం అనేది ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం.ఎవరిమీద ఆధారపడకుండా వ్యాపారాన్ని విజయవంతం చేయటం అనేది ఇక్కడ నేర్చుకోవాలిసిన విషయం.
ఛాలెంజ్ లను తీసుకోవడం:
మీకు తెలుసా గద్దకు తుఫానులంటే భయం ఉండదు..తుఫాన్ వచ్చినప్పుడు హాయిగా తిరుగుతాయి. హ్యాపీ గా ఎంజాయ్ చేస్తాయి. ఇక్కడ వ్యాపారవేత్తలు కూడా కొత్త సవాళ్ళను తీసుకోవడానికి గ్రద్దల్లా సిద్ధంగా ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడకుండా అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలి.
ప్రతికూలతను ఎదుర్కోవడం:
గద్దలు వయసు పెరిగే కొద్దీ వాటి పాత ఈకలు రాలిపోయి కొత్తవి వస్తాయి. ఇది చాలా గద్దకు నొప్పితో కూడినది. ఆ సమయం లో అవి సరిగా ఎగరలేవు కూడా..ఆ సమయంలో అవి ఓపికగా నొప్పిని భరిస్తూ కొత్త ఈకలు వచ్చేవరకు వెయిట్ చేస్తుంది. దీనిని Molting అంటారు. వ్యాపారాల్లో కష్టాలు ఒడిదుడుకులు సహజం. ఒక మంచి బిజినెస్ మాన్ వీటిని అంగీకరించాలి. మార్పును అంగీకరిస్తూ వెళ్ళినప్పుడే విజయం లభిస్తుంది.
నాణ్యత:
గద్దలు చనిపోయిన వాటిని తినవు. గద్ద ఒక శక్తివంతమైన వేటగాడు. చిన్న చిన్న వేటలపై దృష్టి పెట్టవు. అలాగే పెద్ద బిజినెస్ చేయాలనుకునే వారు చిన్న చిన్న ప్రాంతాలపై కాకుండా ముఖ్యమైన ఖచ్చితం విజయం సాధించే అవకాశమున్న ప్రాంతాలనే ఎంచుకోవాలి.
ఇవీ మనం గద్ద నుండి నేర్చుకోవాలిసిన విషయాలు. వాటినుండి ఆదర్శంగా తీసుకుని జీవితంలో, బిజినెస్ లో దూర దృష్టి, ఒంటరిగా ఉండటం, ప్రతికూలతలను ఎదుర్కోవడంలో ధైర్యం గా ఉండటం, మంచి లక్ష్యాలను పెట్టుకోవడం పై ఫోకస్ పెట్టి మీరు కూడా గొప్ప బిజినెస్ మాన్ లా ఎదగండి..
తడి తగిలితె వెంట్రుకలెoదుకు మెత్తబడతాయి ?
....................................
తడి తగిలినప్పుడు వెంట్రుకలు మెత్తబడటానికి కారణం వాటి నిర్మాణంలోనే ఉంది. ప్రతివెంట్రుకపై భాగంలో పొరలుపొరలుగా అమర్చిన క్యూటికల్ అనే రక్షణ కవచం ఉంటుంది. పొడిగా ఉన్నప్పుడు ఈ క్యూటికల్ పొలుసులు బిగుతుగా మారి మూసుకుపోయి ఒకదానిపై ఒకటి పేర్చినట్లు ఉంటాయి. అందువల్ల వెంట్రుకలు గరుకుగా గట్టిగా ఉంటాయి.
తడి లేదా నీరు తగలగానే ఈ క్యూటికల్ పొలుసులు కొద్దిగా విచ్చుకుంటాయి. వెంట్రుకలోని లోపలి భాగమైన కార్టెక్స్‌లో ఉన్న కెరాటిన్ ప్రోటీన్ నీటిని స్పాంజిలా పీల్చుకుంటుంది. కెరాటిన్‌లోని హైడ్రోజన్ బంధాలు సాధారణంగా వెంట్రుకలను బిగుతుగా ఉంచుతాయి. అయితే తడి పడినప్పుడు నీటి అణువులు ఈ బంధాలను తాత్కాలికంగా విడదీస్తాయి. దాంతో కెరాటిన్ తంతువులు సడలిపోతాయి.
ఈ ప్రక్రియలో వెంట్రుక సుమారు 30% వరకు నీటిని పీల్చుకుని ఉబ్బుతుంది. దాని వ్యాసం పెరుగుతుంది. బంధాలు సడలడం, నీరు లోనికి చొరబడటం వల్ల వెంట్రుకలు .మరింత మృదువును పొందుతాయి. అందుకే అవి మెత్తగా మృదువుగా మారుతాయి. అందువల్ల తడి జుట్టును దువ్వడం సులభం, తడి వెంట్రుకలను వివిధ ఆకారాలలోకి తేలికగా మార్చుకోవచ్చును.
అయితే తడి వెంట్రుకలు బలహీనంగా ఉంటాయి. బలంగా లాగితే అవి సులభంగా తెగిపోతాయి. తడి ఆరిపోయిన తర్వాత హైడ్రోజన్ బంధాలు మళ్లీ ఏర్పడి వెంట్రుకలు మరలా తన సహజ స్థితికి చేరుకుంటాయి. అందుకే ఆరిన తర్వాత జుట్టు మళ్లీ గట్టిగా కొద్దిగా గరుకుగా అనిపిస్తుంది.
॥సేకరణ॥
................ జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం
*పరుగో పరుగు -5*
📷🏃🏼
రచన : మల్లిక్
కొన్నిక్షణాలు రాంబాబు, కిష్టయ్య మౌనంగా ఉండిపోయారు.
రాంబాబు దీర్ఘంగా నిట్టూర్చాడు. కిష్టయ్య అంతకంటే దీర్ఘంగా నిట్టూర్చాడు.
“ఎంత అందంగా ఉందండీ గురూగారూ...."
“అవున్రా....చాల అందంగా ఉంది....”
“పేరేమిటండి...."
"ఏమోరా నేను అడగలేదు...."
“అడ్రస్ ?”
"అదీ అడగలేదు...."
"ఏంటండీ గురూగారూ.... అంత అందమైన అమ్మాయిది పేరూ, అడ్రసూ ఏమీ కనుక్కోలేదు మీరు....”
“మన కెందుకురా....ఆ అమ్మాయికి పెళ్ళయింది
.... మెళ్ళో మంగళసూత్రాలు చూళ్ళేదా?"
“అవును గురూగారూ!" కిష్టయ్య చెంపలేసుకున్నాడు.
"ఆ అమ్మాయిని గురించి మర్చిపో...." అన్నాడు రాంబాబు.
కిష్టయ్య తల ఊగించి మళ్ళీ చెంపలేసుకున్నా డు. ఆ అమ్మాయిని మర్చిపో అని రాంబాబు అన్నాడేగానీ ఆ అమ్మాయిని జన్మజన్మలకీ మర్చిపోలేని సంఘటనలు ముందు ముందు తనకు జరుగుతాయని ఆ క్షణంలో రాంబాబుకి తెలియదు.
రాత్రి ఎనిమిదిన్నర గంటలయింది.
"ఇంక వెళదామా?” అన్నాడు రాంబాబు.
“నేనెప్పుడో రెడీ....” అన్నాడు కిష్టయ్య.
రాంబాబు డ్రాయర్ సొరుగు తాళంవేసి లేచాడు.
📖
వాళ్ళిద్దరి గుండెలూ వేగంగా కొట్టుకుంటున్నాయ్
.... నొసలు మీద, అరిచేతుల్లో చెమట ఊరుతూంది. పాదాలు చల్లబడిపోయాయ్.... ఎంత వేగంగా నడవాలన్నా కుదరటంలేదు. కాళ్ళు తడబడుతున్నాయ్. దానికితోడు మాటిమాటికీ చీర కుచ్చెళ్ళు పాదాలకి అడ్డు తగులుతున్నాయ్. భయంతో ఆ ఇద్దరమ్మాయిల ముఖం పాలిపోయింది
“ఛీచ్చీ.... దరిద్రం సినిమా... పాడు సినిమా.." అంది ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు సరోజ. ఇప్పటికి అలా .... ఎన్నిసార్లు ఆందో...
“ఎన్నిసార్లు తిడతావ్....” అంది రెండో అమ్మాయి లక్ష్మి.
"అయినా ఆ వాంప్, హీరోయిన్ గా వేసిన సినిమాకి వద్దే అంటే విన్నావ్?.... ఛీఛీ..... ఏం డాన్సులవి?.... ఈలలు, కేకలూ.... ఒకటే గోల.. "
"కానీ అదంటే నాకు చాల ఇష్టమే.... నేను దాన్ని ఫేన్ని. ” అంది లక్ష్మి.
"రెండోసారి వెళ్ళు ఆ సినిమాకి.... ఛీఛీ.... థియేటర్ మొత్తం మీద మనిద్దరం తప్ప అసలు ఆడాళ్ళు ఎవరయినా వచ్చారా.... అసలు ఆ డాన్సులు ఎలా చూశావే.... ఒకటే గోల.... అరుపులు.... దానికితోడు వెనక నుండి మీద చేతులు వెయ్యడం.... జడలాగడం.... కాళ్ళతో నొక్కడం.... ఛీ.... వెధవలు...." సరోజ ఛీదరించుకుంది.
"సారీనే....సినిమా బాగుంటుందేమో అని తీసుకొచ్చాను....” అంది లక్ష్మి.
“వెనక ఆ వెధన ఇంకా ఫాలో అవుతున్నాడా?....”
" ఏమో....”
"కాస్త చూడు.. "
"బాబోయ్.... నాకు భయం....” అంది లక్ష్మి గుండెలమీద చెయ్యేసుకుంటూ.
“వెధవ వాడే అనుకుంటా మన వెనక లైనులో కూర్చుని మనమీద చేతులు వేసింది.....కాస్త చూడవే...." అంది సరోజ.
“అమ్మో.... నువ్వే చూడు....”
సరోజ మెల్లగా తల తిప్పి చూసింది.
అతను పళ్ళికిలించాడు సరోజను చూసాడు.
పదిగజాల దూరంలో వీళ్లనే ఫాలో అవుతున్నాడు అతను. అడ్డ చారల బనీను వేసుకున్నాడు. అడ్డంగా బలసి ఉన్నాడు. రింగులు రింగులుగా దుబ్బులా ఉన్న జుట్టు, కారా కిళ్ళీతో గారపట్టిన పళ్ళు.... చూడగానే ఇంప్రెషన్ పడిపోతుంది....
"వెధవ ఇంకా ఫాలో అవుతున్నాడే.... ఏమనుకుంటున్నాడో అసలు.... వాడి అందం చూసి మోహించేస్తా మనుకుంటున్నాడేమో....
వెధవ.... అసలీ వెధవలంతా ఏమనుకుంటారో..."
"మనం మ్యాట్నీ చూసి వస్తున్నాం కాబట్టి సరిపోయింది.... అదే ఫష్షో అయితే చీకట్లో ఇంకా భయంవేసేది...." అంది లక్ష్మి మెల్లగా వెనక్కి చూస్తూ.
అడ్డ కారల బనీనువాడు గారపళ్ళు బయటపెట్టి కన్నుకొట్టాడు. వాడు తన నడక వేగం కాస్త పెంచాడు.
"అమ్మో..... వాడు త్వరత్వరగా మన దగ్గరగా వచ్చేస్తున్నాడే.... నాకు భయంగా ఉంది...." అంది లక్ష్మి ఏడుపు ముఖం పెట్టి.
"కాస్త త్వరగా నడువ్....” సరోజ విసుక్కుంది.
“దరిద్రం సినిమాకి వెళదాం అని చంపుకుతిన్నావు గా.... అనుభవించు."
"కాలేజీలో అబ్బాయిలు నువ్వంటే హడలి చచ్చే వాళ్ళు కదే... ఇప్పుడేంటీ ఇలా భయపడుతున్నా వ్.... నువ్వే ఏమైనా చెయ్యాలి...."
"కాలేజీ అబ్బాయిలు వేరు.... ఈ రౌడీ వెధవ వేరు...."
లక్ష్మి మెల్లగా మళ్ళీ వెనక్కి చూసింది. ఆమె గుండె గుభేల్ మంది.
"అమ్మో చాలా దగ్గరకి వచ్చేశాడే...." అంది సరోజ అరచేతిని పట్టుకుని నొక్కుతూ.
వెనకనుండి ఈల వినిపించింది.... "ఏయ్ అమ్మాయ్.... మేడమ్...." పిలుస్తున్నాడు అడ్డవారల బనీనువాడు.
"లాభం లేదు....ఏమైనా చెయ్యాలి...." అనుకుంది సరోజ.
ఇంతలో ఆమెకి మెరుపులా ఆలోచన తట్టింది.
🏃🏼
*సశేషం*
꧁
*భైరవవాక -5*
🔱
రచన: ఇందూ రమణ
అయిదు నిమిషాల్లోనే బస్సు చందనపురి చేరుకుంది. బస్సు స్టాండ్ నిండా జనం!
ఎటు చూసినా.... ఎక్కడ చూసినా జనం జనం.
చీమల పుట్టల్లా ... గుంపులు... గుంపులుగా ఆ ప్రదేశమంతా కిక్కిరిసిన జనం. రకరకాల వ్యక్తులు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మనుషులు. అందరూ రకరకాల వేషాల్లో ఉన్నారు.
వరద బాధితుల్లా ఉన్న యాత్రీకుల్ని రెక్కలు పుచ్చుకు లాక్కుపోతున్నారు కొందరు. ఆ తతంగమంతా గమనించిన పాత్రోకి ఏఁవీ అర్ధం కాలేదు. పాత్రో ముందుగా బస్సు దిగి ఈ వ్యవహార మంతా గమనిస్తూ నిలబడ్డాడు.
ఆఖర్న పాత్రో కుటుంబ సభ్యులు దిగారు. వారి వెనుకే గైడ్ దిగాడు.
పాత్రో పిల్లల కోసం వెదికాడు. ఏరీ?! ఉంటేనా?! ఆశ్యర్యం... ఆందోళన అతని కళ్ళ నిండా కమ్ముకుంది.
అప్పటికే పాత్రో తల్లిదండ్రులు పిల్లల కోసం గాలిస్తున్నారు.
"శాశీ! పిల్లలేరీ?! బప్పా ! పిల్లలేరీ! ... మా పిల్లలేరీ?! "పాత్రో కంఠం ద్భుంతో పేరుకు పోయింది.
"మీ దగ్గర లేరా?!" ఆతృతగా అంది శశికళ.
దాదాపు ఏడుపు గొంతుతోనే అంది ఆమె కూడా.
"నా దగ్గరా!" అయోమయంగా చూసాడు పాత్రో, ఇంతలో ఒకామె వారి దగ్గరకొచ్చింది.
"రండి బాబు ! రండి. మీరు పడుకోవడానికి చాప ఇస్తాను. వంటకి కావలసిన పాత్రలు
... కర్రలు సమకూరుస్తాను రండి. రండి బాబూ!" ఎవరో ముప్పై యేళ్ళ ఆమె పాత్రో చెయ్యి పట్టుకు లాగుతూ అంది.
"ఏయ్! ఎవర్నువ్వు ! పోఁ ! పోఁ !" కోపంతో ఊగిపోతు ఒక్క గసురు గసిరాడు పాత్రో.
కోపంలో అతను 'ఒరియా' లో ఏఁవన్నాడో ఆమెకి అర్ధం కాకపోయినా 'కసురుకోవడం' మాత్రం గ్రహించి సహించలేకపోయింది.
"ఏట్రోరే! నువ్వు వస్తేరా! రాకపోతే పో ! నన్ను కసరడానికి నీకెన్ని గుండెలుండాల్రా! వెధవ సచ్చినోడా? మర్యాదగా రాబాబూ! రా! అంటే నీకు నేను చులకనైపోయాన్రా?” చీర చెంగు చిలకట్టులా నడుముకు దోపుతూ అరిచింది ఆమె. అరుస్తూ వెళ్ళిపోయింది.
ఆమె కోపంతో పేట్రేగిపోయేసరికి పాత్రోకి నోటమాటరాలేదు. భయంతో బిక్క చచ్చిపోయాడు.
పాత్రో తల్లి దండ్రులకు ఆమె ఎందుకలా పిచ్చి పిచ్చిగా అరుస్తోందో అర్ధంకాలేదు.
పాత్రోకి మాత్రం పరిస్థితి అర్థం అయ్యింది. అతని మొహం వివర్ణమైంది. బాధగా తలపట్టుకున్నాడు.
భర్త పరిస్థితిని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది శశికళ. పనిపిల్ల అచేతనంగా శశికళ పక్కనే నిలబడింది.
గైడ్ పాండే మాత్రం ముసి... ముసిగా నవ్వుకుంటూ ఎటో చూస్తూ నిలబడ్డాడు.
📖
పాత్రో కుటుంబమంతా అయోమయంలో కొట్టుకులాడుతుంది. ఏం చేయాలో తోచక అలాగే అచేతనంగా నిలబడి పోయారందరూ.
సామాన్లుతో పిల్లలు ...గోపాలపురం బస్సు స్టాండ్లోనే ఉండిపోయారు. అక్కడే ... అలాగే ఉండి ఉంటారు.
తిరిగి వెళ్తే అక్కడే ఉంటారు...
అదీ ఆ కుటుంబ సభ్యులందరి యోచన... ఆలోచన. గైడ్ పాండే మాత్రం ఎవరి కోసమో ఎదురు చూస్తూ నిలబడ్డాడు.
ఇంతలో ఇంకో సిటీ బస్సు వచ్చి వాళ్ళ ముందు ఆగింది. ఆ బస్సులో పిల్లలు కనిపించేసరికి అవాక్కయిపోయారందరూ ఒక్క గైడ్ పాండే తప్పా.
బస్సు ఖాళీ అయిన తర్వాత సామాన్లు కూడా దగ్గరుండి కండక్టర్ దింపించాడు.
పాండే వెళ్ళి కండక్టర్ కి కృతజ్ఞతలు తెలిపి పిల్లల్ని, సామాన్లని వాళ్ళ దగ్గరకు చేర్చాడు.
పాత్రోకి అంతులేని ఆనందం కలిగింది.
'ఎవరో పుణ్యాత్ములు తన పిల్లల్ని ... సామాన్లని బస్సెక్కించి పుణ్యం కట్టుకున్నారు.' అనుకున్నాడు మనసులోనే.
పిల్లల్నిద్దర్నీ దగ్గరకు తీసుకొని అక్కున చేర్చుకుంది శశికళ.
"మీరెవరూ ఏఁవీ అనుకోనంటే చిన్న విషయం" నెమ్మదిగా నవ్వుతూ చిన్నగా అన్నాడు పాండే.
“ఏఁవిటీ?" పాత్రో అన్నాడు.
మిగతా వాళ్ళందరు కూడా పాండే ఏం చెప్పబోతున్నాడో తెలుసుకుందామని ఆత్రంగా చెవులు రిక్కించారు.
"నేనే పిల్లల్ని సామాన్లని అక్కడ సామన్లు మోసే నాకు తెలిసిన 'కలాసీ' కి అప్పగించి తరువాత బస్సులో ఎక్కించమన్నాను. మనం ఎక్కిన బస్సులో పిల్లలు ఎక్కితే నలిగిపోతారని అలా చెప్పాను. ఆ విషయం దాచి మిమ్మల్ని ఇలా క్షోభ పెట్టినందుకు క్షమించండి."
గైడ్ పాండే చేసిన నిర్వాకానికి నవ్వాలో ... ఏడ్వాలో అర్ధం కాలేదెవరికీ!
కానీ, తమ పిల్లలు ... సామాన్లు తమకి చేరాయి. అంతే చాలు. 'పోనీలే! వెధవ డబ్బు ఎంతఖర్చయినా మంచి వ్యక్తి అండ దొరికింది.' అనుకున్నారందరూ.
అప్పటికి గాని గైడ్ పాండే విలువ వాళ్ళెవరూ గ్రహించలేకపోయారు.
"బాబూ! నువ్వే ఎలాగో మా మొక్కులు తీరిన వరకూ మాతోనే ఉండి తిరిగి మేం మా వూరు రైలెక్కేవరకూ తోడుగా ఉండి పుణ్యం కట్టుకో నాయన.” అంటూ పాత్రో తల్లిదండ్రులిద్దరూ పాండే చేతులు పట్టుకున్నారు.
"అలాగే నండి. అది నా బాధ్యత కూడా!" నవ్వుతూ అన్నాడు పాండే. నవ్వుతూ అనుకోకుండా పనిపిల్ల వైపు చూసాడు.
పనిపిల్ల గైడ్ పాండేనే తదేకంగా చూస్తోంది. అతను కూడా తనని చూస్తున్నాడని గ్రహించగానే చిన్నగా నవ్వి కళ్ళతోనే ప్రసంశించింది.
పాండే కి మనసు పులకరించింది.
'ఇంత అందగత్తెని ఇంతవరకూ తను పట్టించుకోలేదే. ఎప్పటి నుంచి తనని ఇలా గమనిస్తోందోకదా! పని పిల్లల్లో ఇంత మంచి సొగసు గత్తెలుంటారని గ్రహించ లేదు.' అనుకుంటూనే పాత్రో భార్య శశికళ వైపు ఓరగా చూసాడు.
ఆమె పిల్లలిద్దర్ని అక్కున చేర్చుకుంటోంది. తల్లి ప్రేమ. ఎంతైనా ఆడది. అమ్మ మనసు కదా!
📖
పిల్లలు, సామాన్లు దిగిన బస్సులో అంతా గిరిజన యాత్రికులే ఉన్నారు. కోయ భాషలో కండక్టర్ చుట్టూ మూగి గోల చేస్తున్నారు. వారి పక్కనే పాత్రో నిలబడి అంతా గమనిస్తున్నాడు. అప్పటికే రాత్రి పది కావస్తోంది.
ఈ లోగా పాండే, పాత్రో దగ్గరకొచ్చి నిలబడ్డాడు.
"అదేవిటి?! మన దగ్గర రెండు రూపాయలు పుచ్చుకొని వాళ్ళ దగ్గర మూడేసి రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నాడు." పాత్రో పాండేని ప్రశ్నించాడు.
దాదాపు పాతిక, ముపై మంది గిరిజనుల దగ్గర కండక్టర్ వాళ్ళతో ఉన్న గైడ్ కలసి వచ్చీ రాని కోయ భాషలో మాట్లాడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు.
"వాళ్ళు ఎక్కడ ఎక్కారో?" పాండే సంశయంగా అన్నాడు.
"మాతోనే రైల్లో వచ్చారు. వాళ్లూ గోపాలపురం లో మనమెక్కిన బస్సు ఎక్కలేక ఉండిపోయింటారు." పాత్రో అన్నాడు.
"అయితే అది మామూలే! భాషరాని కొత్త వ్యక్తుల దగ్గర ఇలా ఎక్కువ వసూలు చేసుకోవటం అందరికీ పరిపాటే. యాత్రకని ఎంతోమంది... ఎన్నో రకాల వ్యక్తులు ... ఎక్కడెక్కడి నుండో వస్తారు. వాళ్లకి బస్సు చార్జీ ఎంతో తెలీదు కదా! అందువలన ఇలా దోపిడీ చేస్తుంటారు." అన్నాడు పాండే.
"ఎంత దగా!" పాండే చెప్పిందంతా విన్న పాత్రో కుటుంబ సభ్యులంతా ఒక్కసారే అన్నారు.
'అంతేనా?! ఇంకా ముందు ముందు మీకే తెలుస్తుంది.' అని మనసులోనే అనుకొని నవ్వుకున్నాడు పాండే.
ఇందాక కసిరేసి వెళ్లిన ఆమె పాత్రో దగ్గర కొచ్చి మళ్లా అంది వచ్చీ రాని ఒరియాలో.
"మీరు పడుకోవటానికి తుంగ చాప.. వంట కి పాత్రలు నేనే దగ్గరుండి సమకూరుస్తాను రండి" అంటూ పిలిచింది.
పాత్రోకి ఆమె ఏమందో అర్ధమయింది గానీ, ఎందుకలా తమని ప్రత్యేకంగా పిలుస్తోందో అర్ధం కాలేదు.
పాత్రో ఆలోచన అర్ధం చేసుకున్న గైడ్ భావగర్భితంగా నవ్వి ఊరుకున్నాడు. ఈ వర్తకుల విషయంలో తను తల దూరిస్తే ఇంకేమైన ఉందా? తానీ వూర్లో ఉండగలడా?
ఆమె తమని ఎందుకు పిలుస్తోందో తల్లికి తండ్రికి చెప్పాడు పాత్రో. అప్పటికే ఆమె మాటలను బట్టి వారు కూడా అర్ధం చేసుకున్నారు.
వంట పేరెత్తేసరికి అంతవరకూ ఏమూలను దాక్కుందో గాని 'ఆకలి' ఆవురావురు మంటూ వాళ్లనందర్నీ ఆరగించడం ప్రారంభించిది.
"అయితే, పదండి. మరి, దేనికి ఆలస్యం! వేగంగా పోయి వంట కానిచ్చేసి నాలుగు మెతుకులు తిని పడుకుందాం! ఉదయాన్నే లేచి భైరవ స్వామిని దర్శించి ఆ తర్వాత చందన స్వామి సన్నిధికి వెళదాం" పాత్రో తండ్రి అన్నాడు.
"భైరవ స్వామి మొక్కుందా మీకు !? " గైడ్ అడిగాడు.
" ఆఁ ! అదే ముఖ్యమైంది!" పాత్రో చెప్పాడు.
"రండి!" ఆమె మళ్లా వెనక్కొచ్చి పిలిచి పాత్రో చెయ్యి పట్టుకుని ఈడ్చుకు వెళుతుందేమోనన్నట్టుగా ముందుకు నడిచింది. ఎవరూ అడ్డు చెప్పలేదు.
ఆమెతో పాటు అందరూ వెళ్ళారు.
📖
పాత్రో భార్య ఆమెనే గమనిస్తోంది. ఆమె వర్తకురాలిలాలేదు. నాజూగ్గా నవనవ లాడుతోంది. మనిషంత మనిషిని సిగ్గూ ఎగ్గూ లేకుండా చెయ్యి పట్టుకు లాక్కెళ్లడం చూసి శశికళకి ఒళ్లు మండుతోంది.
ఏంచేయగలదు ?! పరాయి ప్రాంతం. పరాయి వ్యక్తులందరూ. యాత్రా స్థలం. దేన్నీ తప్పుగా అర్ధం చేసుకోకూడదని తనకు తానే సరిపెట్టుకుంది శశికళ.
పరాయి స్త్రీ అంత చనువుగా... అంత దగ్గరగా రాసుకుంటూ నడుస్తుంటే పాత్రో మనస్సు పరిపరి విధాలా పోతోంది. ఒక పక్క సిగ్గూగా... అనిపించినా ఆ స్థితి ఇష్టంగానే ఉంది. మరో పక్క వెనుక నడుస్తున్న తల్లి దండ్రులు, భార్య, పాండే, పనిపిల్ల తనని గమనిస్తున్నారేమోననే భావం... బిడియం పాత్రోని పీకుతూనే ఉన్నాయి.
ఆమె ప్రవర్తన ... భర్త నడక గమనిస్తూనే ఉంది పాత్రో భార్య శశికళ.
ఆమె వాళ్ళని పాత బస్సు స్టాండ్ కి తీసుకువెళ్ళింది. అది ఇప్పుడు చందన స్వామి దర్శనానికి వెళ్ళేందుకు కొండ బస్సు స్టాండ్ గా వినియోగిస్తున్నారు.
అక్కడ-
ఆ విశాలమైన బస్సు స్టాండ్ ఆవరణ అంతా వందలమంది యాత్రీకులతో కిటకిటలాడుతోంది. కేకలతో అరుపులతో గందరగోళంగా ఉంది. విశాలమైన ఆవరణ మధ్య మదపుటేనుగులా చిత్రాటోపీ, ఒకే ఒక గది ఉన్న ఆ చిత్రాటోపీ పోలీసు బీట్ లా ఉంది. ఆ బిల్డింగ్ లో చందన స్వామి దర్శనానికి వెళ్ళడానికి బస్సు టిక్కెట్లు అమ్ముతుంటారు.
ఏమూల చూసిన పదేసిమంది ఒక గుంపు గా కూర్చొని వంట చేసుకుంటున్నారు. కొందరు అప్పుడే వడ్డించేసుకొని భోజనాలు కూడా కానిచ్చేస్తున్నారు. ఓ మూల కట్టెలు అమ్ముకుంటున్నవాళ్ళు... ఇంకో మూల మట్టి కుండలు, మరో మూల వరస వరసంతా కొబ్బరి కాయలు దుఖాణాలు
ఉన్నాయి.
ఆ బస్సు స్టాండ్ చుట్టూ ఎత్తైన ప్రహారీ. ప్రహారీ గోడనానుకొని కొబ్బరి కాయలు కుప్పలు... కుప్పలుగా పోసున్నాయి.
అంతా కోలాహలంగా ఉంది. వ్యాపారస్థు లంతా హడావిడిగా తిరుగుతున్నారు.
యాత్రికులంతా ఎవరి పనుల్లోవారున్నారు.
కఛేరి గంటలు ఠంగు... ఠంగు మని వరుసగా పది మ్రోగాయి. పాండే అప్రయత్నంగా వాచీ చూసుకున్నాడు. పావుగంట ఎక్కువే అయింది. కఛేరి జవాను నిద్ర పోయింటాడనుకున్నాడు గైడ్ పాండే.
“ఆ గంటలేఁవిటీ!" పాత్రో సంశయంగా అడిగాడు.
"అవి దేవస్థానం కఛేరి గంటలు. పూర్వాచారం ప్రకారం అక్కడ ఉండే జవాను గంట గంటకి లేచి వూరంతా విన్పించేలా... సమయాన్ని తెలియజేస్తూ గంటలు కొట్టాలి. దేవాలయం సిబ్బందికి ... పనిలో ఉండే క్రింద ఉద్యోగులకి ఊర్లో ఉన్న ఇళ్ళలో వారికి టైమ్ తెలియడం కోసం రాజుల కాలం నుంచి ఇలా గంటలు కొట్టడం అలవాటు.” చెప్పాడు పాండే.
ఇంతలో ఓ మూల విశాలంగా ఉన్న దగ్గర పాత్రో కుటుంబం కోసం రెండు తుంగ చాపలు పరిచి వెళ్ళిపోయిందామె. సామాన్లన్నీ క్రింద పెట్టి అందరూ అలసట గా ఒక్కసారే ఆ చాపల మీద కూలబడ్డారు.
అప్పుడు -
అప్పుడు గుర్తొచ్చింది పాత్రోకి. ఆ వూర్లో తన మిత్రుడికి తెలిసిన వ్యక్తి ఒకడున్నాడని. ఛటుక్కున నిలబడి పర్సుకోసం జేబులు వెతుక్కున్నాడు.
పర్సు కనిపించలేదు...
🔱
*సశేషం*
꧁

Comments
Post a Comment