🌻 Q 63:--mental physics అంటే ఏమిటి? మన శాస్త్రవేత్తలు ఏ విధంగా పరిశోధిస్తే మన సైన్స్ develop అవుతుంది? - 1 🌻
Ans :--
1) మనకంటే ముందు నాగారికతల్లో మానవజాతి physics ని మైండ్ ద్వారా అంతర్ శక్తి ద్వారా అభివృద్ధి చేశారు.దీనినే mental physics అంటారు.
2) గ్రహాల స్థితిగతుల్ని నక్షత్రాల స్థితిగతుల్ని సౌరవ్యవస్థ ఆవిర్భావాల్ని మెంటల్ ఫిసిక్స్ ద్వారా అధ్యయనం చేశారు. వారు మనకంటే లక్షల రెట్లు జ్ఞానాన్ని పొందారు.
3) spaceships నిర్మించి, కాలాన్ని ఛేదించి అంతరిక్ష యానం చేశారు.చంద్రమండల యానం చేశారు. ఇతర గ్రహాల యానం చేశారు.
ఇప్పటి సివిల్ engineer లకు సాధ్యంకాని ఎన్నో కట్టడాలను కట్టారు. ప్రస్తుతం మెంటల్ physics ని అభివృద్ధి చేస్తే మన చైతన్య పరిణామం వేగంగా కొనసాగుతుంది.
విశ్వంలోని ఎన్నో రహస్యాలను ఛేదించగలము.
4) మనం కనిపెట్టిన పరికరాలతో చైతన్య పరిణామం తాలూకూ అభివృద్ధి దాని కదలికల్ని ఏమాత్రం పసిగట్టలేవు.electron దాని చుట్టూ అది తిరుగుతూ కేంద్రకం చుట్టూ తిరుగుతుంది.
దీన్ని పరిశోధించడంలో సైన్స్ fail అయ్యింది. electronని ఒక కణం గానే కాకుండా దాని చైతన్య శక్తిని మల్టిడిమెన్షనల్ activity ని mental physics ద్వారా పరిశోధన చేసినట్లయితే అద్భుతమైన విషయాలు తెలుసుకో గలరు.
5)భూమి, జీవజాతులు, మనిషి వీటన్నింటి మధ్య అనుసంధానం పదార్ధం యొక్క శక్తిస్వభావం పైన పరిశోధన చేసినప్పుడే నిజమైన physics అభివృద్ధి చెందుతుంది.
5) శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలన్ని చాలా వరకు తప్పే వారు పదార్ధాన్ని దాని కున్న చైతన్యశక్తి తో కూడా అధ్యయనం చేయాలి. కంటికి గోచరం కాని చైతన్య శక్తిని అంతర్వాణి ద్వారా study చేయాలి.
6) మన సమీప నాగరికతల్లో భౌతిక వాస్తవాలు ఇప్పటి పరిస్థితులకు భిన్నంగా ఉండేవి. భూ అయస్కాంత ఉత్తర దక్షిణ ధృవాలు reverse లో ఉండేవి. అప్పుడున్న సైన్స్ టెక్నాలజీ ఎంతో ఉన్నతంగా ఉండేది.
7) petrol, diesel కి బదులుగా ధ్వనిని ఇంధనంగా వాడే వారు. ధ్వనితో దేహము యొక్క జబ్బుల్ని తగ్గించేవారు. ధ్వని ద్వారా వాహనాల్ని నడిపేవారు, పదార్ధాన్ని కదల్చడానికి, బరువుల్ని తూకం వేయడానికి ధ్వనిని వాడే వారు.
ఇప్పుడున్న ఫిజిక్స్ కి భిన్నంగా వేరే దిశలో physics అభివృద్ధి చెందింది. అంతర్ ప్రయాణం చేసి జ్ఞానాన్ని సంపాదించేవారు. వేరే వరల్డ్స్ కి వేరే systems కి astral ట్రావెల్ చేసేవారు.
8) ఆ నాగరికత కు చెందిన జీవరాసులన్నీ పదార్ధంతో కూడిన భౌతిక దేహాలను తీసుకునే స్థితిని దాటివేసి భౌతిక దేహాన్ని తీసుకునే సమయంలో సమాంతర లోకాలలో కూడా జన్మ తీసుకుని భౌతిక స్థితిని దాటివేసి other dimensions లోకి ప్రవేశించేవారు.
9) Atlaantis, Lumeria నాగరికతలు atlantic, pacific మహాసముద్రం లో మునిగిపోయాయి.
వీటి నాగరికత లకు సంబంధించిన విషయాలన్నీ ఆకాశిక్ రికార్డ్స్ లో పొందుపరచబడి ఉంటాయి. అంతర్ ప్రయాణం ద్వారా ఆ నాగరికతకు tune అయితే ఆ information అంతా తెలుసుకోవచ్చు.
8) dolphin అనే సముద్ర జాతి మానవుని లాగే కుటుంబవ్యవస్థ ను కలిగి ఉంది.వాటి పరివర్తన, భావోద్వేగాలు వినయ విధేతలు సామాజిక సాహచర్యం మానవ జాతితో పోలి ఉంటాయి. dolphins ఇతర సముద్రజాతికి ఎంత సహాయ పడతాయంటే మానవజాతి సిగ్గుపడేంతగా.
కొన్ని నాగారికతల్లో సముద్రజాతి మానవజాతిని dominate చేసింది.
ప్రత్యామ్నాయ లోకాలలో సముద్రజాతి మానవజాతి పైన ఆధిపత్యం వహిస్తుంది.
9) మొదట ఏకకణ జీవులుగా, రాళ్లు, రప్పలు, కీటకాలు, వృక్షాలు, జంతువులు, ఖనిజ లవణాలుగా పరిణామం చెందుతూ మానవ దేహాన్ని తీసుకోవడం జరిగింది.
మానవ దేహంలో కూడా ఎన్నో అనుభవాలు పొంది, ఎన్నో జన్మలు తీసుకుని అనగా కొన్ని జన్మలు అంగవైకల్యం తో కొన్ని జన్మలు సంతోషంగా ఇలా ఆత్మ అనుభవాలు పొందడం కోసం జన్మ తీసుకుంటుంది. మనకు అంగవైకల్యంతో ఉన్న జన్మ బాధాకరంగా అనిపిస్తుంది.
మన analytical మైండ్ ఏర్పరుచుకున్న భావన మాత్రమే బాధపడటం అంటే. ఆత్మకు ఇలాంటి జన్మ ఒక adventure. అంగవైకల్యం కర్మకాదు, ఆత్మ పొందాలనుకున్న అనుభవం.
రాముడు నామస్మరణ భావంతో:
రామ్ రామ్ రామ్ అనరా నరుడా
శ్రీరామ అని పిలిచి తరించ గలడా ॥
పల్లవి:
రామనామమే జీవన ధామమురా
రఘురాముడే దుఃఖ వినాశకుడురా ॥
చరణం 1:
ఆపద వచ్చిన వేళ అండగ నిలిచెడురా
ఆర్తి తీర్చు దైవము ఆదిరాముడురా
పాపమెల్ల కరిగించు పవన నామమురా
భక్తి మార్గ చూపించు భద్ర దీపమురా ॥
చరణం 2:
సీతారామ చరణం చింతన చేయరా
చిరశాంతి సౌఖ్యమెల్ల చేరునయ్యరా
హనుమంతు తోడుంటే భయమే లేదురా
హరినామ స్మరణమే తరణి దారిరా ॥
ముగింపు:
రామ్ రామ్ రామ్ అనగ హృదయం పవిత్రమై
రామ భక్తి వెలుగుతో జీవితం ధన్యమై
నామమే నావగానూ సంసార సాగరన్
దాటించు శ్రీరాముడు దయాసింధురా ॥
****
భావశుద్ధి
ఓంశ్రీమాత్రే నమః
పూజకు ఉపయోగించే ద్రవ్యాలు శుభ్రంగా ఉండాలనుకోవడం సహజమే. కస్తూరి, పునుగు వంటి సుగంధ ద్రవ్యాల్ని జంతువుల నుంచి సేకరిస్తారు. ఆవుపాలను లేగదూడ, తేనెను తేనెటీగలు ఎంగిలి చేస్తాయి. అటువంటి బాహ్యసామగ్రికి సంబంధించిన శుచికైనా, శుద్ధతకైనా ఒక కొలమానం లేదు. స్వామికి శుచిగా అర్పించదగినది మనసు ఒకటే!
మనసు, బుద్ధి, చిత్, అహంకారంతో కూడినది- అంతఃకరణ. దీన్ని శుద్ధి చేయాలంటే, సంస్కరించాలి. మానవ దేహం అన్నింటి సమాహారం.
ఇందులో పరమాత్మ ఉన్నాడని అతడు గ్రహించి వ్యవహరించాలి. పవిత్రత ఉండటం, లేకపోవడం అనేవి కేవలం మనోభావాలు. దోషపూరితమైనవాటినీ దోష రహితంగా చూసేది మనసే. దైవానికి అర్పించే పదార్థాల పరిధిని గుర్తించాల్సింది, వాటి యథార్థ తత్వాన్ని ఆకళింపు చేసుకోవాల్సింది భక్తహృదయమే!
సకల చరాచర సృష్టి- పంచభూతాత్మక మయం. దీనికి చిహ్నంగా భగవంతుడికి చేసే అర్చన పంచోపచార పూజ. భక్తుడు పృథ్వీతత్వంతో గంధాన్ని, వాయుతత్వంతో ధూపాన్ని, అగ్నితత్వంతో దీపాన్ని సమర్పిస్తాడు. అలాగే జలతత్వంతో అర్ఘ్యం, ఆకాశతత్వంతో పుష్పం స్వామికి అర్పిస్తాడు.
దైవంలో లేనిది, దైవం కానిది ఏదీ లేదు. పరమాత్మ పరిపూర్ణుడు. ఆయన సర్వజ్ఞత్వం, స్వతంత్రత, అనంతశక్తి తత్వాలతో భాసిల్లుతుంటాడు. ఆ మహాపూర్ణ స్వరూపానికి సమర్పించడానికి మనిషి వద్ద ఏదీ లేదు. చేతులు జోడించి శరణాగతి వేడటమే ఏకైక మార్గం.
వస్తుదోషం, కర్మలోపం లేని కార్యం ఏదీ ఉండదు. విధి నిర్వహణలో లోపాలు దొర్లడమూ సహజం. సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మయజ్ఞం చేసినా, ఏవో కొన్ని కర్మ లోపాలు తప్పవు. యజ్ఞయాగాదుల్లో చోటుచేసుకునే లోపాలకు ప్రాయశ్చిత్త హోమాలు ఉన్నాయి. వాటిలోనూ దొర్లే చిన్నపాటి తప్పిదాలకు క్షమాపణ అర్థిస్తారు భక్తులు.
ఈశ్వరారాధనలో వస్తువు పవిత్రత కన్నా పావనమైన భావనే మిన్న. శ్రద్ధగా కర్మల్ని ఆచరించాలి. బుద్ధిని వికసింపజేసి, సారాన్ని గ్రహించాలి. విగ్రహారాధన వల్ల నిగ్రహం కలుగుతుంది. భక్తి, శ్రద్ధ, ప్రపత్తులు దీని ఫలాలు. వీటితో భావశుద్ధికి బీజం పడుతుంది.
ఆరాధన మార్గంలో తాత్విక దృష్టి, తార్కి కత, శాస్త్రీయ దృక్పథం ఇమిడి ఉన్నాయి.‘నా ముఖాన్ని అవలోకించేందుకు అద్దం ఉపాధి (ఆధారం). నన్ను నేను తెలుసుకునేందుకు దైవం ఉపాధి’ అనే సత్యాన్ని భక్తుడు అవగతం చేసుకోవాలి. ‘నాలోని పరమాత్మను నేను గుర్తించాలంటే, అందరిలోనూ ఆయనను దర్శించడాన్ని ముందుగా అలవరచుకోవాలి’ అని గ్రహించి మసలాలి. ఎదుటివారి లోపాల్ని ఎంచకుండా వారిని సంస్కరించడానికే ప్రయత్నించాలి. ద్వేషాన్ని ప్రేమతో జయించాలి. భావ శుద్ధి ఉంటే, భావ సిద్ధి లభిస్తుంది. ఏ భావనతో అర్చిస్తే, పరమాత్మ ఆ భావననే సిద్ధింపజేస్తాడు. ఏ రూపంలో భావిస్తే, ఆ రూపంలోనే స్వామి దర్శనమిస్తాడు.
ఒక భక్తుడు ఆధ్యాత్మిక దృష్టితో విష్ణు సాన్నిధ్యం కోరాడు. ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో మహాయజ్ఞాన్ని సంకల్పించాడు. సంబారాలు సమకూర్చాడు. రుత్విజులకు ఆహ్వానం పలికాడు. అంతలోనే అకాల మరణం పొందాడు. యజ్ఞసంకల్పం నెరవేరలేదన్న బాధ అతడిది. అయినప్పటికీ, ఆ భక్తుడికి విష్ణుపదం ఆహ్వానం పలికిందని పురాణ కథనం. ‘నువ్వు తలపెట్టిన కార్యంతో పని లేదు, నీలో వెల్లివిరిసిన భావనే ప్రధానం’ అనేది అందులోని అంతరార్థం.
(()))
సూర్యుని --- ద్వాదశ రూపాలు
ఓంశ్రీమాత్రే నమః
1. ఇంద్రుడు :- స్వర్గాధిపతి అయి దుష్టశక్తులను సంహరించాడు.
2. ధాత :- ప్రజాపతియై భూతములను సృష్టించాడు.
3. పర్జన్యుడు:- తన కిరణాలతో నీటిని ద్రవించి, తిరిగి మేఘరూపంలో వర్షించును.
4 త్వష్ట :- ఓషదాలలో, వృక్షాలలో ఫలించే శక్తి.
5. పూష :- ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగిస్తాడు.
6. అర్యముడు :- దేవతారూపంలో వుంటాడు.
7. భగుడు :- ప్రాణుల శరీరంలో వుండి, వారిని పోషిస్తాడు.
8. వివస్వంతుడు :- ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాడు.
9.విష్ణువు :- శత్రువులను నాశనం చేస్తాడు.
10. అంశు మంతుడు :- గాలిలో నిలిచి, ప్రాణాల శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు.
11. వరుణుడు :- జీవులు తాగే నీటిలో వుండి, వారిని రక్షిస్తాడు.
12. మిత్రుడు :- లోకాలలో మేలు చేస్తూ... చైతన్యాన్ని కలిగిస్తాడు.
***
ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండుగురు సూర్యులు. సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.
1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత',
2. వైశాఖంలో అర్యముడు,
3. జ్యేష్టం-మిత్రుడు,
4. ఆషాఢం- వరుణుడు,
5. శ్రావణంలో ఇంద్రుడు,
6. భాద్రపదం- వివస్వంతుడు,
7. ఆశ్వయుజం- త్వష్ణ,
8. కార్తీకం- విష్ణువు,
9. మార్గశిరం- అంశుమంతుడు,
10. పుష్యం- భగుడు,
11. మాఘం- పూషుడు,
12. ఫాల్గుణం- పర్జజన్యుడు.
ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.
భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు.అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కధనం ప్రకారం...
బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రని తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని 'యుగ సహస్ర యోజన పరాభాను' అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెబుతారు.
దీన్ని లెక్క కడితే 'యుగం.. 12000 ఏళ్లు, సహస్రం 1000, యోజనం 8 మైళ్లు, మైలు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది.సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.
ఆ ఏడు గుర్రాల పేర్లు:- 1. గాయత్రి, 2. త్రిష్ణుప్పు,3. అనుష్టుప్పు, 4. జగతి, 5. పంక్తి,
6. బృహతి, 7. ఉష్ణిక్కు. వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.
******
శీర్షిక: హనుమ ఉన్నందునే
పల్లవి:
హనుమ ఉన్నందునే రామాయణ గాథయే
హరుషమై వెలసెనయ్యా భక్తి మార్గమై ॥
రాముడు నడిచెనయ్యా ఆంజనేయ తోడుతో
రఘుకుల దీపమయ్యా ధర్మదేవుడై ॥
చరణం 1:
సీతమ్మ జాడ తెలిసె లంక దాటి వెళ్లగా
సింధువైన భయమెల్ల చిన్ని దారియై
వానర సేనకందు మార్గదర్శి అయ్యగా
వారధియే నిర్మితమై విజయ ఘోషయై ॥
చరణం 2:
లక్ష్మణుని ప్రాణమెల్ల సంజీవితో నిలిచె
ద్రోణగిరి మోసినట్టి దైవ శక్తితో
రావణుని గర్వమెల్ల రామబాణమై కరిగె
రామనామ మహిమగానూ రణరంగమున్ ॥
చరణం 3:
భక్తిలో హనుమంతు సేవలో పరాక్రమం
శక్తిలో వినయమెల్ల జగతి నేర్పెనయ్యా
రామకథ పరిపూర్ణం ఆంజనేయ కృపవల్ల
లోకమంత పొంగెనయ్యా భక్తి గానమై ॥
ముగింపు:
హనుమజ్జయంతి నాడు హృదయమందు నిలుపుదాం
ఆంజనేయ నామమే ఆనంద మార్గమై
రామభక్త హనుమంతు కరుణ చూపునందునా
రామాయణ జీవితం రమ్య కావ్యమై ॥
*****
పల్లవి :
రామనామ మధురమూర్తీ రణధీర హనుమా!
రగులుతున్న భక్తి దీప రక్షకా! హనుమా!
కన్నీటి లోక జీవ గుండెలో నిలిచేవా!
కష్టమెల్ల కరిగించేటి కరుణామయ! హనుమా! ॥
చరణం – 1 :
వజ్రదేహ మై నిలిచి వానరేంద్ర రూపమై
వెలుగువై భువనమంత విరజిమ్ము తేజమై
హృదిలో రామచంద్ర నామమొక్క శ్వాసమై
భక్తజనుల పాలనకై భువికొచ్చిన దైవమై ॥
చరణం – 2 :
అంజనా గర్భ పుణ్య ఫలముగా అవతరించి
అంధకార భయములన్ని అగ్నివలె దహించితి
లంకలో సీతమ్మ బాధ కన్నులారా చూచితి
ఒక్క రామ దూతవై లోకమంత నిలిచితి ॥
చరణం – 3 :
సంజీవిని కొండనెత్తి సౌమిత్రిని బ్రతికించి
సంకటాల సంద్రమందు ఆశ దీప మెలిగించి
బలమంటే భుజముకాదు భక్తియే అని తెలిపి
వినయమే మహాశక్తి అని జగతికి నేర్పితి ॥
చరణం – 4 :
సిందూర వర్ణ రూప! చినుకులాంటి కరుణతో
చిన్నవాని మొర వినే చిత్తశుద్ధి దేవతా!
కొండగట్టు నిలయుడై కోటి జనుల అండవై
కోరినట్టి మనసులన్ని కోమలంగా దీవించు ॥
ముగింపు :
రామచంద్ర పాదసేవ రత్నమాల ధరించిన
మారుతీ! మనోజవా! మంగళాల నిలయమా!
నీ నామ స్మరణమే నిత్య శాంతి మార్గమై
నీవు ఉన్న హృదయమే నిజమైన అయోధ్యా ॥
***
*రామాంజనేయ భాష్య ప్రభవం*
హనుమజ్జయoతి సందర్భంగా శుభాకాంక్షలు
శా. నామిత్తంబుగ నీవు నాథుడవుగన్ నానంద హృద్యంబుగన్
నేమీయిచ్ఛను తీర్చు నామదిగనున్ నీధర్మ సర్వాత్మకున్
నీమా భక్తునిగా నుశక్తికలనా నిత్యానుబంధంబుగన్
ఈ మాలింగన సంతసాభవముగన్ ఈప్సిత మోక్షంబుగన్ ॥
సరళ భావం:
“ఓ నాథా! నీవు నా జీవితానికి కారణభూతుడవు; నిన్ను పొందుట వలన నా హృదయం ఆనందంతో నిండిపోయింది.నా కోరికలన్నిటినీ ధర్మమార్గంలో నెరవేర్చువాడవు; సమస్త జీవులకు ఆత్మస్వరూపుడవు.
నేను నీ భక్తునిగా నీ శక్తిని, నీ కృపను నిత్యసంబంధంగా పొందుతున్నాను.ఈ నీ ఆలింగనానందమే నాకు పరమఫలమై, కోరుకున్న మోక్షస్వరూపమై అనుభవమవుతోంది.”
*****
మ. కో. కోరనింకను నేను యేమియు కొత్తగామది మిత్రమా
సార సంభవ నీ కటాక్షము సాధు బుద్దిగ నేస్తమా
ప్రేరణంబుయు నీదయాకృప ప్రేమ తత్వము సాలుమా
మారలేనును నీదునామము మానసంబున రామమున్
ఒక మిత్రుడు/దివ్యస్వరూప సాన్నిధ్యం వల్ల మనసులోని కోరికలు క్రమంగా తగ్గిపోయాయి. ఆ సాన్నిధ్యమే జ్ఞానాన్ని, సద్బుద్ధిని, ప్రేమతత్వాన్ని కలిగించింది. దాని ప్రభావంతో మనసు పూర్తిగా మారిపోయి, ఇక కొత్తగా ఏమీ కోరాల్సిన అవసరం లేకుండా ఒకే భావంలో స్థిరపడింది. చివరికి ఆ స్థితి రామస్మరణలో లీనమై, “నీవే నా మనసు” అనే ఏకత్వ భావానికి చేరింది.
****
రాముడు హనుమంతునితో పలుకులు
ఎంత వారికి నైన తప్పదు ఎంచ లేనిది కాలమున్
పంతమన్నను పాశమన్నను పాఠ్యమవ్వక తప్పదున్
శాంతి యన్నది లేని రోజులు సంభవంబగు కర్మగన్
ఎంత చెప్పిన భార్యతోడగు నోటులోటగు మిత్రమా
కాలగతి తప్పదు. బంధాలు, ఆశలు, పంతాలు అన్నీ జీవితం నేర్పే పాఠాలే. శాంతి లేని రోజులు కూడా కర్మఫలమే. కానీ, జీవితంలో భార్య సహచర్యం లేకపోతే మాటలకే లోటు ఏర్పడుతుంది; మనసు చెప్పుకునే తోడు లేక జీవితం వెలితిగా మారుతుంది — ఓ మిత్రమా! అని రాముడు చెప్పినట్లుంది.
****
హనుమంతుని ఓదార్పు
తోడు గున్నది హృద్యమందున తిష్ట వేసియు సత్యమున్
నేడుమర్వక వేదనంబున ని త్యమెందుకు మిత్రమా
నాడు చేసిన పుణ్యమంతయు నమ్మ గల్గుట తోడుగన్
పాడు తాపము నిన్ను చేరదు పాఠ్యమే యగు సీతగన్
“ప్రభూ! తోడు దూరమైనా, ఆమె హృదయంలోనే నిలిచి ఉంది — అది సత్యం. గతించిన దినాలను తలచుకొని నిత్యం వేదనలో మునిగిపోవడం ఎందుకు? మీరు చేసిన పుణ్యమే మీకు తోడుగా నిలుస్తుంది. సీతమ్మవారు మీ జీవితానికి పాఠమూ, పవిత్రతయూ. అలాంటి స్మరణ ఉన్నచోట దుఃఖతాపం మిమ్మల్ని జయించలేదు” అని హనుమంతుడు ఓదార్చినట్లుగా ఉంది.
****
రాముని వాక్కులు
పలుకులన్నియు శాంతి పోషక పాలనామది తీరుగన్
సలపరింతలు లేనిజీవన సన్నిదేదియు తెల్పుమా
అలక కోపము తప్పకేయగు ఆశ పాశము చింతయే
వలను చిక్కగ జీవమేయగు వాన యెoడల సీతగన్
భావం:
“మాటలు అన్నీ శాంతిని పోషించే విధంగా ఉండాలి — అదే జీవనపాలన యొక్క సరైన తీరు. చిన్న చిన్న సరస సంభాషణలు, అలకలు, ఆప్యాయతలు లేని జీవితం ఏ ఆనందాన్ని ఇస్తుంది చెప్పు మిత్రమా! ఆశ ఉన్నచోట అలక, కోపం, చింత తప్పవు. ప్రేమ అనే వలలో చిక్కుకున్నప్పుడే జీవితం నిజమైన అనుభూతిని పొందుతుంది; వాన–ఎండల మాదిరిగా సుఖదుఃఖాలతో కూడినదే సీతాసహచర్యం” అని రాముడు చెప్పినట్లుంది.
****
హనమ మాటలు
సన్నజాజులు పూలు తెచ్చియు శాంతి కోరితి గుర్తుగన్
మిన్ననైనను సఖ్యతాభవ మేలొసంగును సిద్ధిగన్
నెన్న యున్నను మర్వలేనిది లేర్చి కూర్చగ సఖ్యతన్
సన్నిధానము దీక్ష తత్త్వము సామరశ్యము మౌనమున్
భావం:
“ప్రభూ! చిన్న సన్నజాజి పూలు తీసుకొచ్చినా, అందులో శాంతి కోరికే గుర్తుగా ఉంటుంది. చిన్న అలకలు వచ్చినా, సఖ్యతాభావమే చివరికి మేలును ఇస్తుంది. ఎన్నో సంఘటనలు జరిగినా మరువలేని అనుబంధమే మనసులను మళ్లీ కలిపి కూర్చోబెడుతుంది. నిజమైన సాన్నిధ్యం అనేది దీక్ష, తత్త్వం, సామరస్యం, మౌనం — ఇవన్నీ కలిసిన పవిత్ర బంధం” అని హనుమంతుడు చెప్పినట్లు ఉంది.
***
రాముని మాటలు
ఉ.నమ్మకమేయిదీ పలుకు నన్నును నెమ్మది గుంచ గల్గగన్
నమ్మిన వారుగామనసు నామది తీరుగ నుండ గల్గగన్
నెమ్మది బాధతొల్గగల నీదగు సఖ్యత వేదవాక్కముల్
సమ్మతి రావణాసురుని సాధ్య యసాద్యము సీత చూపుగన్
భావం:
“నీ మాటలు నాలో నమ్మకాన్ని నింపి, మనసుకు నెమ్మదిని కలిగిస్తున్నాయి. విశ్వసనీయులైన స్నేహితులు మనసుకు ఆధారంగా నిలుస్తారు. నీ సఖ్యత వేదవాక్యంలా బాధను తొలగించే శక్తిని ఇస్తోంది. సీతమ్మ చూపు ఉన్నచోట రావణాసురుడి సాధ్యాసాధ్యాలు ఏమాత్రం నిలవవు; ధర్మమే చివరకు గెలుస్తుంది” అని రాముడు హనుమంతునితో అన్నట్లుంది.
****
హనుమ మాటలు
శా.రామా రావణ శంబుదేవరకళా రాక్షశ్వ తీరే తపమ్
రామానిత్యపరాత్పరాభవముగన్ రాజ్యంబు సంతృప్తిగన్
రామాలక్ష్యముసీతతాకను విరాగీగాను నేచూసితిన్
రామాసీతగుణంబునీతలుపులే రమ్యత్వ విశ్వాసమున్
మొత్తం భావతత్త్వం:
రావణుడు శివభక్తుడు. తపస్సు, విద్య, శక్తి, రాజ్యసంపద — అన్నింటినీ సంపాదించాడు. దేవకృపతో అతని రాజ్యం వైభవంగా ఉంది. అయినప్పటికీ, సీతమ్మను అపహరించినా ఆమెను తాకని ఒక నియమవిరాగం అతనిలో కనిపించింది. ఆ నియమాన్ని హనుమంతుడు గమనించాడు.
కానీ, ఆ బాహ్యశక్తి కంటే గొప్పది ఏమిటంటే —
రాముడు హృదయంలోని విశ్వాసం.
రాముని తలపుల్లో ప్రతిఫలించిన సీత గుణగణాలే నిజమైన రమ్యత, పవిత్రత, ధర్మసౌందర్యం అని హనుమంతుడు గ్రహించాడు.
****
రామ పలుకు
హనుమాదీవెన నివ్వనీమనసుగన్ దీప్తించ రామంబుగన్
జనలక్ష్యంబగు జాగృతీవిధముగన్ జాతశ్వ సేవార్దిగాన్
ననయాశక్తిగ నిన్ను గొల్వగనిజానామంబు
యుక్తేయగున్
ఘనమేనీదయ సర్వ వేళలగు టన్ గమ్యంబు ధైర్యంబుగన్
మొత్తం భావతత్త్వం:
“ఓ హనుమా! నీ దీవెన, నీ సాన్నిధ్యం నా మనసును రామతత్వ దీప్తితో నింపుతోంది. ప్రజలకు ఆదర్శమయ్యే జాగృతి, సేవాభావం నీవల్లే స్ఫూర్తి పొందుతున్నాయి. నిన్ను ఆశ్రయించి స్మరించుట వల్ల నిజమైన నామస్మరణకు యుక్తి, శక్తి లభిస్తుంది. నీ దయ ప్రతి వేళ గొప్ప ఆధారంగా నిలిచి, జీవనగమ్యానికి ధైర్యాన్ని ఇస్తోంది” అని రాముడు పలికినట్లు ఉంది.
****
బ్రహ్మ రాత అక్షరం పొల్లుబోదు, బ్రహ్మాండ మంతా జ్వాలా తోరణంగా మారినా, బతికే ప్రాణులెన్నో ఆరోగ్యానికి హాని ఎడారిలో ఉన్న, పసిడి పర్వతముపై దాగి ఉన్న
అనారోగ్యం రాకమానదు, కుండను సముద్రంలో ముంచిన, బావిలో ముంచిన కుండడే తేగలవు, అంతకన్నా రావు అదే వ్యర్ధాగ్నిని ఆర్పకపోతే నష్టం, దానికితోడు నెయ్యిని పోస్తే ప్రభంజనం, అట్లే కోర్కలకు కళ్ళెం వెయ్యకపోతే నష్టం, ఆశలు పెరిగినకొద్ది ఆరోగ్యానికి నష్టం, మానవ ప్రయత్నం తో దైవసంకల్పం అవసరం
సత్యం పల్కని చోట, ధర్మం గుర్తించని చోట, న్యాయం ఉండని చోట, దీపారాధన చెయ్యని చోట, సాధు సాంగత్యం లేని చోట, ధనం సమ్మతి చెందని చోట, ధన కాంక్షము నింగిన చోట, శత్రురాహిత్యం లేని చోట, ఋణం ఇవ్వని చోట, నమ్మకం లేని చోట,
కాపురం చేయ రాదు, చెయ్యవలసిన స్థితి, బ్రహ్మరాత ధిక్కారం, ఎవ్వరి వల్ల కానే కాదు
తల్లి,తండ్రి, గురువు, దైవ బలం మన అయుష్యుకు మనః శాంతి కి మార్గం
*ఈశ్వరుడనగా శరీరధారులకు ఆత్మ స్వరూపుడు. ఈశ్వరుడు లేకపోతే మనము లేము. ఈశ్వరుని ప్రతిబింబముగా మనమున్నాము.**ఈశ్వరుడు మనలో ఉండడము చేత పంచభూతములు పనిచేస్తున్నాయి. ఈశ్వరుడు మనలో ఉండడము చేతనే మనలో ఎరుక పనిచేస్తుంది. ఈశ్వరుడు ఉండడము చేతనే మనకు ఆయుర్దాయము ఉంటుంది.**ఈశ్వరుడు మనయందు మనవలె ఉంటే, మనమే ఉన్నామని అనుకుంటూ ఉంటాము. నిజానికి నేను కాదు ఉన్నది ఈశ్వరుడే అని తెలియడమే జ్ఞానము. అపుడే ఈశ్వరుడు మన యందు పరిపూర్ణముగా అవతరించి మన సమస్తము అతనే నిర్వర్తిస్తాడు.
--(())--
Comments
Post a Comment